కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిధిని మీరు ఊహించలేరు

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ విజయాన్ని అందరూ అంచనా వేసినా.. ఇంత భారీగా ఆయన విజయం ఉంటుందన్నది మాత్రం ఊహించలేదు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ ను దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి కేజ్రీవాల్ పంపలేదు.

కానీ.. అందుకు భిన్నంగా ఆయన ఒకరికి మాత్రం తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపి ఆశ్చర్యానికి గురి చేశారు. కేజ్రీవాల్ స్పెషల్ గా ఎంపిక చేసిన ఆయన ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరో కాదు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజున బుల్లి కేజ్రీవాల్ అంటూ అందరి ప్రశంసలు పొందిన బుడతడే.. స్పెషల్ ఇన్విటేషన్ అందుకున్నాడు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున పార్టీ కార్యాలయం వద్ద కేజ్రీవాల్ మాదిరి టోపీ.. స్వెటర్.. మఫ్లర్.. కళ్లజోడు ధరించిన ఈ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. క్యూటెస్ట్ చైల్డ్ఆఫ్ ద డేగా నిలిచాడు. అతడి ఫోటో మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున వైరల్ అయ్యింది. ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరూ ఆప్ కార్యకర్తలే. బుల్లి కేజ్రీవాల్ గా గుర్తింపు పొందిన ఆ బుడతడికి తన ప్రమాణస్వీకారోత్సవం వేళ.. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానం అందింది.
× RELATED కేటీఆర్ తో కేజ్రీవాల్ పోటీ: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆప్ ఫోకస్
×