నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో

ఒక మంచి మాట చెప్పేందుకు ఏమాత్రం సంకోచించని తత్వం ఉపాసన రామ్ చరణ్ సొంతం. అపోలో ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా హెల్త్ మ్యాగజైన్ ని నిర్వహిస్తూ ప్రజలకు.. అభిమానులకు హెల్త్ పరమైన టిప్స్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైల్డ్ లైఫ్ కి సంబంధించిన మ్యూజియమ్ ని ఉపాసన తన స్వగృహంలో ప్రారంభించారు. దీనికి సెలబ్రిటీల్ని ఆహ్వానించారు. ఇంకా తన రెగ్యులర్ లైఫ్ లో ఎన్నో సేవలకు సంబంధించిన మేనిఫెస్టోని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే. సంఘంలో గుర్తింపు దక్కాలంటే సాటి మనిషికి మేలు చెయ్యాలన్న మంచితనాన్ని ఉపాసన ఉద్భోదిస్తున్నారు.

నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక మంచి మాటను అభిమానులకు చెప్పారు. ప్రతి మనిషి తనని తాను ప్రేమించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ``నిన్ను నువ్వు ప్రేమించడమే మానవ సంబంధాల్ని బలపరిచేందుకు సంకేతం అని అన్నారు. మనుషుల మధ్య బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా? అయితే అందుకు కొన్నిటిని ప్రయత్నించాలని తెలిపారు. తొలుత నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నిస్తే .. ఇతరులను ప్రేమించే సద్గుణం అలవడుతుందని ఉపాసన అన్నారు. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు చెయ్. ఇదే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మారుస్తుంది.. అని ఒక గొప్ప విషయాన్ని ప్రభోదించే ప్రయత్నం చేశారు.

ఉపాసన ట్వీట్ కి చరణ్ అభిమానులు సహా నెటిజనుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా తనకు శుభాభినందనలు తెలిపారు ఫ్యాన్స్. ఎదుటివారికి భోధించడమే కాదు.. తాను అనుసరించి చూపిస్తారు కాబట్టే సంఘంలో తనకంటూ ఓ స్థాయి దక్కిందనడంలో సందేహం లేదు. ఇక తాను కన్న కలల్ని సాధించుకునేందుకు పూర్తిగా మనసు పెట్టి పని చేస్తారు. ఇటీవల తన కలల సౌధంగా భావించిన సొంత గృహాన్ని డిజైనర్ లుక్ తో నిర్మించుకునేందుకు ఎంతో మనసు పెట్టి పని చేశారు. జూబ్లీహిల్స్ లో చరణ్ - ఉపాసన జంట నిర్మించుకున్న వైట్ హౌస్ కి అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు 38 కోట్లు వెచ్చించారని ప్రచారమైంది.


× RELATED హీరోయిన్ కు రక్తంతో నటుడి లవ్ లెటర్