అధికారం పోయి ఆరేళ్లు అయ్యింది ..అహంకారం నుంచి బయటపడాలి

నేషనల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకి మరింతగా దిగజారుతోంది. పార్టీ చరిత్ర లో ఎన్నడూ ఎదుర్కొనటువంటి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు పార్టీ తరపున నిలబడే అభ్యర్థుల కోసం వెంపర్లాడే స్థితికి వచ్చింది అంటే కాంగ్రెస్ ఎంత దీనస్థితిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ..ఒక్క సీటుని కూడా గెలుచుకోలేక పోవడం కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది.

ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2015 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది. అలాగే తాజా ఢిల్లీ ఎన్నికల్లో 66 మంది కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే 63 మందికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఈ వ్యవహారం పై కాంగ్రెస్ సీనియర్ నేతలు సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారం పోయి ఆరేళ్లు అవుతున్నా మన లో చాలా మంది నేతలు ఇంకా మంత్రుల్లానే ఫీల్ అవుతున్నారు అని కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా జైరాం రమేశ్ గురువారం కామెంట్ చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది అని సింధియా చెప్తూ పార్టీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని లేకపోతే వచ్చే రోజుల్లో మరింత గడ్డుకాలం ఎదురయ్యే ఛాన్స్ ఉందని లోక్ సభ ఎన్నికల తర్వాత చాలా రాష్ట్రాల్లో సర్కార్లు ఏర్పాటు చేశామని నేతలందరూ ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉందని సింధియా తెలిపారు. అలాగే మరో సీనియర్ నేత జైరాం రమేశ్ కాంగ్రెస్ నేతలు అహంకారం నుంచి బయట పడాలి. వాళ్ల తీరులో మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు.ఢిల్లీ రిజల్ట్స్ కాంగ్రెస్ కు కరోనా విపత్తు లాంటిదని అయన తెలిపారు.

ఇక ఢిల్లీ లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ పార్టీ ఇంచార్జ్ పీసీ చాకో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాశ్ చోప్రా రాజీనామా చేశారు. షీలా దీక్షిత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైన తర్వాతే కాంగ్రెస్ డౌన్ ఫాల్ మొదలైంది అని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజీనామా చేసిన తరువాత చాకో చేసిన ఈ ఆరోపణలు పార్టీ లో ప్రకంపనలు సృష్టించాయి.
× RELATED ఫోటో స్టోరి: ఆరడుగుల సర్పకన్య
×