ఇంటి రిపేర్లకు కేటాయించిన నిధులని రద్దు చేసిన సీఎం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు నేటి వరకు ఎక్కడ ఎంత అవసరమో అంతే ఖర్చుపెడుతూ ..ప్రజాధనాన్ని పొదుపు చేస్తూ వస్తున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి లోని సీఎం జగన్ ఇంటి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు జివోలని సీఎం రద్దు చేసారు.

పూర్తి వివరాలు చూస్తే.. సీఎం గా ప్రమాణ స్వీకారం రోజు నుంచి ప్రజాధనాన్ని ఎలా పొదుపు చేయాలి.. అని ఆలోచిస్తూ తన ప్రమాణస్వీకారాన్ని సైతం  ఎదో ఒక చిన్న ఫంక్షన్ లా చేసి అందరికి ఆదర్శంగా నిలిచిన సీఎం జగన్ ...రాజకీయమంటే వ్యాపారం వృత్తి కావని రాజకీయమంటే ప్రజలకి సేవ చేయడమే అని నిరూపించారు.  తాజాగా సీఎం జగన్ నివాసం -క్యాంపు కార్యాలయంకు సంబంధించి వివిధ పనులకు సంబందించిన నిధుల కేటాయింపు జీవోలు నిలుపుదల చేస్తూ ప్రభుత్వ అధికారులచే ఉత్తర్వులు జారీ చేయించారు.

ఇందులో భాగంగానే .. తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవోలు రద్దు చేసింది ఏపీ సర్కార్. తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్ కొనుగోలు - విద్యుత్ సౌకర్యం - ఇతర వసతుల కోసం కేటాయించిన నిధులు తనకు వద్దని సుమారు రూ. 3కోట్ల విలువైన పనులకు సంబందించిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రద్దుకు సంబంధించి 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. అధికారిక నివాసానికి నిధుల కేటాయింపుపై గతంలో ప్రతిపక్షాల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే వారికి ధీటుగా సమాధానం ఇచ్చేలా జగన్ తన ఇంటికి కేటాయించిన నిధుల్ని రద్దు చేశారు.
× RELATED 'మా' అధ్యక్షుడు నిధుల దుర్వినియోగమా?
×