ఉన్నావ్ రేప్ కేసు: ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి సీఎం గ్రీన్ సిగ్నల్ !

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం మరువకముందే ఉన్నావ్ బాధితురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బాధితురాలు గత గురువారం కోర్టుకు వెళ్తుండగా ముగ్గురు నిందితులు ఆమె శరీరం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన ఆమెను మొదట లక్నోలోని ఆసుపత్రికి - ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితురాలు చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో శుక్రవారం కన్ను మూసింది. 

ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. దీనితో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కేసు పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన పై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దోషులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురితో బాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వారిని త్వరలో కోర్టులో హాజరు పరచడానికి సిధ్ధమయ్యారు. కాగాఈ కేసులో హైదరాబాద్ తరహా న్యాయం కావాలని - ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.


× RELATED సీఎం జగన్ నిర్ణయానికి తొలిసారి పొగిడేసిన పవన్ కళ్యాణ్ । Pawan Kalyan Praises CM Jagan Decision
×