శివసేనలో మొదలైన తిరుగుబాటు ..!

శివసేన .. ప్రస్తుతం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ తో  పొత్తుతో బరిలోకి దిగి ..ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం కోసం పొత్తుని కూడా కాదు అనుకోని బీజేపీ నుండి బయటకి వచ్చింది. సేన - బీజేపీ కి కలిపి కావాల్సినంత మెజారిటీ ఉన్నప్పటికీ ..ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయారు. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పార్టీలోని సగానికి సగం మంది  ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

బీజేపీతో కాకుండా ఎన్సీపీ - కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతుండటంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించారు. కానీ - తమ వద్ద   కావల్సిన సంఖ్యాబలం లేదని బీజేపీ వెనక్కి తగ్గింది. ఈ సమయంలో శివసేన అధిష్ఠానం ఆ పార్టీ ఎమ్మెల్యేలందర్నీ ముంబైలోని ఓ హోటల్ కు తరలించింది. ఈ హోటల్లోనే పార్టీ ఎమ్మెల్యేలు అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చిరకాల మిత్రపక్షమైన బీజేపీని కాదని భావజాల పరంగా వైరుద్ధ్యమున్న ఎన్సీపీ - కాంగ్రెస్ తో ఎలా కలిసి వెళ్తారని వారు సీరియస్ అయినట్లు సమాచారం.
 
ఆలా కొన్ని రోజులు హోటల్ లో ఉంచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను తమతమ సొంత ఇళ్లకు ఎందుకు తరలించారని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కూడా ఉద్ధవ్ పై సగం మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై అదే హోటల్ లో ఎమ్మెల్యేలు ఒకరినొకరు తీవ్ర దుర్భాషలు ఆడుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు శివసేన అంతర్గత వర్గాలు చెప్తున్నాయి. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ యువనేత ఆదిత్య ఠాక్రే వెంటనే ఆ హోటల్ కు చేరుకొని ఎమ్మెల్యేలందరిని  శాంతపరిచినట్లు తెలుస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలైతే ఏకంగా అధిష్ఠానం ముందే ఈ వైఖరి మంచిది కాదు అంటూ అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భావజాలపరంగా తీవ్ర విభేదాలున్న పార్టీలతో మనం ఎలా కలిసి నడుస్తాం అని సంగం మంది ఎమ్మెల్యేలు అడుగుతునట్టు సమాచారం.
× RELATED శివసేన పతనం వెనుక ఆ లేడి.?