సుమలత ఫోన్ల ట్యాప్ నిజమే..?

కర్ణాటకలో మొన్నటి ఎంపీ ఎన్నికల సందర్భంగా నాడు అధికారంలో ఉన్న జేడీయూ-కాంగ్రెస్ సర్కారు తన ఫోన్లు ట్యాప్ చేసిందని ప్రముఖ నటి అంబరీష్ భార్య అయిన సుమలత అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే.. మాండ్యా లోక్ సభ సీటులో సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పై పోటీచేసిన సుమలత గుట్టుమట్లు తెలుసుకునేందుకే ఆమె ఫోన్లను నాడు కుమారస్వామి సర్కారు ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి.. జేడీయూ కాంగ్రెస్ నేతలు సైతం సుమలత ఆడియో లీక్స్ విడుదల చేసి ఆమె దుర్భాషలాడిన మాటలు వైరల్ చేశారు. ఆమెను ఎంత ఓడగొట్టాలని ప్రయత్నించినా సాధ్యం పడలేదు.

అయితే వీటిపై నాడు ఎలాంటి విచారణ జరపలేదు. కుమారస్వామి సీఎంగా ఉండడంతో కేసు ముందుకు సాగలేదు. తాజాగా కుమారస్వామి సర్కారు దిగిపోయి బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడంతో సుమలత ఫోన్ ట్యాప్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. సుమలత ఫోన్ ను కుమారస్వామి సర్కారు ట్యాప్ చేసింది నిజమేనని కర్ణాటకలో కొలువుదీరిన బీజేపీ సర్కారు స్పష్టం చేసింది. ఆ ఆడియోలు కూడా కొన్ని లీక్ అయినట్టు గుర్తించింది.

మాండ్యాలో సీఎం కుమారస్వామి తనయుడిపై సుమలత స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలిచింది. బీజేపీ ఆమెకు సంపూర్ణ మద్దతునిచ్చింది. అప్పటి నుంచి బీజేపీతో  సాన్నిహిత్యంగా సుమలత ఉంటోంది.

అప్పుడు ఆమె ఆరోపించినట్టే సుమలత ఫోన్లు ట్యాప్ కు గురికావడం.. తాజాగా ఆ లీకులు బయటకు రావడంతో కుమారస్వామి సర్కారు చేసిన కుట్ర రాజకీయం బయటపడినట్టైంది.
× RELATED కొవిడ్ ఎఫెక్ట్.. సెల్ ఫోన్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లు అన్నింటికి ధరాఘాతమే
×