కార్తి ఖైదీ.. 73 నాట్ అవుట్!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'.  ఈ సినిమాను తెలుగు లో కూడా సేం టైటిల్ తో విడుదల చేశారు.  దీపావళి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కార్తికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ ముందుకు సాగుతోంది.

'ఖైదీ' ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇంకా థియేటర్ల లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో కొనసాగుతూ ఉంది. గత కొన్నేళ్లు గా కార్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తడబడుతున్న సంగతి తెలిసిందే.  మధ్యలో 'ఖాకీ' సినిమాకు మంచి పేరు వచ్చినా చెప్పుకో దగ్గ కలెక్షన్స్ మాత్రం రాలేదు. కానీ 'ఖైదీ'తో ఆ లోటు తీరిపోయింది.  ఈ విజయం కార్తి కి మరింత ప్రత్యేకమైనది.  ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమా తో విజయం సాధించడం సులువే కానీ ఇలా హీరోయిన్ లేకుండా.. పాటలు లేకుండా ఒక రాత్రి లో కథ సాగే యాక్షన్ డ్రామా తో ప్రేక్షకులను మెప్పించడం సాధారణ విషయం కాదు.

మరో విషయం ఏంటంటే ఈ సినిమా తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా 'బిగిల్'(తెలుగులో విజిల్) తో పోటీ పడి మరీ ఈ కలెక్షన్స్ సాధించింది.  దీపావళి సీజన్ లో తమిళనాట విజయ్ కు తిరుగు లేని రికార్డ్ ఉంది. అయినా కార్తి సినిమా భారీ కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమే అని చెప్పుకోవాలి.  ఈ సినిమా తో దర్శకుడు లోకేష్ కనగారాజ్ ఒక్కసారిగా కోలీవుడ్ లో హాట్ షాట్ డైరెక్టర్ గా మారిపోయాడనే టాక్ వినిపిస్తోంది.  మెగాస్టార్ చిరంజీవి కి 'ఖైదీ' టైటిల్ తో ఉన్న అనుబంధం తెలిసిందే. ఆ టైటిల్ ఉంటే బాసు సినిమా సూపర్ హిట్టే.. ఇప్పుడు సేమ్ టైటిల్ కార్తికి కూడా లక్కు తీసుకొచ్చిందని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు
× RELATED 73 ఏళ్ల వయసులో కేసీఆర్ భజన చేస్తానంటున్న గద్దర్
×