బాహుబలి రాయల్ షో లో జక్కన్న దోతితో ఫిదా

ఇండియన్ సినీ చరిత్రలో ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం బాహుబలికి దక్కింది. లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి సినిమాను ప్రదర్శించడం ప్రతి ఒక్క ఇండియన్ కూడా గర్వించే విషయం. ఇప్పటి వరకు హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమాలు తప్ప ఏ దేశానికి చెందిన ప్రాంతీయ సినిమాలు కాని.. ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు కాని ప్రదర్శింపబడలేదు. అలాంటి ప్రతిష్టాత్మక గౌరవం దక్కించుకున్న సినిమా ప్రదర్శణకు చిత్ర యూనిట్ సభ్యులు అంతా లండన్ వెళ్లారు.

లండన్ లో రాయల్ ఆల్బర్ట్ హాల్ లో సినిమా ప్రదర్శణతో పాటు కీరవాణి లైవ్ కూడా ఇచ్చారు. ఆ సందర్బంగా స్టేజ్ పైకి వెళ్లిన రాజమౌళి పంచె కట్టు.. కుర్తాతో నార్త్ ఇండియాను అక్కడ రిప్రెజెంట్ చేశాడు. ప్రపంచానికి సౌత్ ఇండియా కట్టు బొట్టును దర్శకుడు జక్కన్న చూపించాడు. ఇలాంటి వేదికలపై మామూలుగా అయితే కంఫర్ట్ కోసం.. క్లాసీ లుక్ కోసం సూటు బూటు వేస్తారు. కాని జక్కన్న మాత్రం అంతర్జాతీయ సమాజంకు మన సాంప్రదాయంను చూపించే ఉద్దేశ్యంతో పంచె కట్టాడు.

148 సంవత్సరాల చరిత్ర ఉన్న రాయల్ ఆల్బర్ట్ హాల్ లో పంచె కట్టుతో కనిపించిన రాజమౌళి కేవలం అక్కడకు వచ్చిన 5500 మంది దృష్టిని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. విభిన్నమైన మన పంచెకట్టును ప్రపంచానికి తెలియజేసేందుకు జక్కన్న ఈ పని చేశాడు. మరోసారి తన డ్రస్సింగ్ తో దక్షిణ భారతదేశంకు ముఖ్యంగా తెలుగు వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చాడు. రాయల్ షో లో జక్కన్న అండ్ టీం చేసిన సందడి అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రసారం అయ్యాయి.

× RELATED కేసీఆర్ విజన్ కు వాటర్ మ్యాన్ ఫిదా
×