స్టార్ హీరోయిన్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మంత్రం

ట్రెండ్ మార్చాలన్నా.. ట్రెండ్ సెట్ చేయాలన్నా కూడా సినీ స్టార్స్ వల్లే జరుగుతుంది. సినిమా స్టార్స్ ఎక్కువగా ఏదైనా కాస్ట్యూమ్ ధరించినట్లయితే వెంటనే ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ అవుతాయి. సామాన్యులు కూడా వాటిని ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాలం మారుతున్నా కొద్ది కొత్త ట్రెండ్స్ వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త స్టైల్ లో కాస్ట్యూమ్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో పాతవి కూడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్ అవుతున్నాయి.

ఒకప్పటి డ్రస్ లు ఒకప్పటి స్టైల్ మళ్లీ ఇప్పుడు అనుకరిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగి పోయింది. 70 లలో హీరోయిన్స్ పోల్క డాట్స్(గుండ్రని చుక్కలు) ఉన్న చీరలు లేదా డ్రస్ లను ఎక్కువగా వేసుకునే వారు. పాత సినిమాలు చూసినట్లయితే మనకు క్లీయర్ గా అర్థం అవుతుంది. కాలం మారి 90 తర్వాత ఆ మోడల్ కాస్ట్యూమ్స్ అంటే ఓల్డ్ మోడల్ అని.. వాటిని అనుకరించడం మానేశారు. కాని 2020 లో మళ్లీ అవే కొత్త మోడల్ గా వస్తున్నాయి.

పోల్క డాట్స్ కాస్ట్యూమ్స్ తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకునే.. సోనాక్షి సిన్హా.. సర అలీఖాన్.. అనన్య పాండ్య.. సోనమ్ కనిపించారు. ఈ అయిదుగురు కూడా పోల్క డాట్స్ డ్రస్ లు మరియు చీరలపై అమ్మాయిల్లో ఆసక్తి కలిగేలా చేశారు. మార్కెట్ లో మళ్లీ పోల్క డాట్స్ కాస్ట్యూమ్స్ కు గిరాకీ పెరిగిందట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ అయిదుగురు హీరోయిన్స్ ట్రై చేయడంతో ఇప్పుడు అంతా వాటి వెంటే పడుతున్నారు. పోల్క డాట్స్ డ్రస్ లలో ఈ అయిదుగురు కూడా చాలా అందంగా ఉండటంతో పాటు ఆకర్షణీయంగా కనిపించారు. అందుకే మళ్లీ పోల్క డాట్స్ డ్రస్ లు ఫేమస్ అవుతున్నాయి.
× RELATED హీరో హీరోయిన్లను కలిపిన తెలివైన నిర్మాత!
×