ఫొటో స్టోరీ : 'అలవైకుంఠపురంలో' అక్కినేని అబ్బాయి

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పటి వరకు హీరోగానే నటిస్తూ వచ్చిన సుశాంత్ మొదటి సారి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ మూవీ కోసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని ఒక పాత్రకు త్రివిక్రమ్ సంప్రదించగా వెంటనే ఓకే చెప్పాడు. సుశాంత్ కు బాగా సూట్ అయ్యే పాత్ర అంటూ మొదటి నుండి చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇటీవలే అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ లుక్ ను రివీల్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు సుశాంత్ స్టిల్ ను విడుదల చేశారు.

ఫార్మల్ డ్రస్ వేసుకుని.. టై కట్టుకుని చాలా క్లాస్ గా సుశాంత్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. సుశాంత్ లుక్ తో అతడి పాత్ర ఏంటీ అనే విషయమై ఒక అవగాహణకు వచ్చేయొచ్చు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి పాత్ర అయ్యి ఉంటుందనిపిస్తుంది. అల్లు అర్జున్ మరియు సుశాంత్ ల మద్య సీన్స్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సుశాంత్ ఒక వైపు అల వైకుంఠపురంలో సినిమా చేస్తూనే మరో వైపు హీరోగా చేసేందుకు కథలు వింటున్నాడట. త్వరలోనే సుశాంత్ హీరోగా కొత్త సినిమా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం సక్సెస్ నటుడిగా మంచి పేరు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుశాంత్ సెటిల్ అయ్యేనా చూడాలి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల వైకుంఠపురం చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ సినిమాను చేస్తున్నాడు.
× RELATED ఫోటో స్టోరీ: వైట్ డ్రెస్ లో రకులిజిం
×