లేడీ కామ్రేడ్ గొర్రెల కాపలా ఎందుకో?

'గీత గోవిందం' చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రష్మిక మందన్న మారిపోయింది. ఆ సినిమా తర్వాత పలు ఫ్లాప్ లు పడ్డా కూడా ఆమె క్రేజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబుకు జోడీగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు.. తమిళం.. కన్నడంలో చాలా బిజీ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న రష్మికకు చెందిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ ఫొటోలో రష్మిక గొర్రెల కాపరిగా కనిపిస్తుంది. చేతిలో కర్ర పట్టుకుని ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తుంది. రష్మిక ఏ సినిమా కోసం ఇలాంటి పాత్రలో కనిపించబోతుందనే చర్చ మొదలైంది. అసలు ఈ ఫొటో ఇప్పటిదేనా లేదంటే పాతదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రష్మిక ఈ ఫొటో ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటో గురించి రష్మిక స్పందించాలని చాలా మంది ఆమెను ట్యాగ్ చేస్తూ ఎప్పుడు.. ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా విభిన్నంగా రష్మిక ఈ ఫొటోలు ఉంది.

ప్రస్తుతం ఈమె తెలుగులో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తోంది. అదే విధంగా తమిళంలో సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తోంది. మరి ఆ చిత్రాల్లో రష్మికను ఇలా చూడబోతున్నామేమో చూడాలి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటిస్తున్న కారణంగా ఈ అమ్మడు క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.
× RELATED డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఆ లేడీ యాంకర్
×