వింత జబ్బుతో బాధపడుతున్న మెగా హీరోయిన్

సినిమా స్టార్స్ వెండి తెరపై చాలా యాక్టివ్ గా కనిపించడం.. అందంగా కనిపించంతో వారు చాలా అదృష్టవంతులు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటాం. కాని వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. ఇండస్ట్రీలో పలువురు స్టార్స్ దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారు వారి సమస్యలను పక్కకు పెట్టి పట్టుదలతో సినిమాల్లో రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో.. సరైనోడు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కేథరిన్ తెర్సా. ఈమె అత్యంత అరుదైన జబ్బుతో బాధపడుతోంది.

తన జబ్బు గురించి ఇన్ని రోజులుగా నోరు విప్పని కేథరిన్ ఇటీవల పూర్తిగా చెప్పేసింది. ప్రాణాల మీదకు వచ్చే జబ్బు అయితే ఏమీ కాదు. కాని ఆమె ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకు ఆమె జబ్బు ఏంటో తెలుసా అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. ఎంత దుర్వాసన అయినా వారికి తెలియదు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు. ఈ జబ్బు అంత్యంత రేర్ గా వస్తుందట.

ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్ కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తూ ఉంది. తన జబ్బు సినిమాల్లో నటించడానికి అడ్డు కాదని ఆమె అంటోంది. ఇన్ని రోజులు చెప్పని కేథరిన్ ఇప్పుడు ఎందుకు చెప్పిందంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
× RELATED ఫైటర్ హీరోయిన్.. రాజీకొచ్చేశారేం?
×