'అల వైకుంఠపురంలో' అన్నీ ఉంటాయట

అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' చిత్రం తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. 2019 లో బన్నీ ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయాడు. నా పేరు సూర్య చిత్రం నిరాశ మిగల్చడంతో చాలా స్క్రిప్ట్ లు విని చివరకు తనకు రెండు సక్సెస్ లు ఇచ్చిన త్రివిక్రమ్ పై నమ్మకం పెట్టాడు. వీరిద్దరి కాంబలో రాబోతున్న అల వైకుంఠపురంలో చిత్రం హ్యాట్రిక్ కాబోతుందని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. సంక్రాంతికి భారీ పోటీ మద్య రాబోతున్న ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్ టైనర్ అంటూ ప్రచారం జరుగుతుంది.

త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటాయి. అయితే ఈ చిత్రంలో కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్.. కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని.. యాక్షన్ సీన్స్ కు బాగా స్కోప్ ఉండటం వల్ల సినిమాలో బన్నీ స్టంట్స్ భారీగానే చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటేనే బన్నీ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారు. అందుకే ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్ ను త్రివిక్రమ్ పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్ గత చిత్రం 'అరవింద సమేత' చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కామెడీ విషయంలో కాస్త మైనస్ అయ్యింది. ఆ సినిమాకు జరిగిన తప్పు అల వైకుంఠపురంలో జరుగకుండా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల దారిలోనే అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించబోతుంది. టబు చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం నుండి విడుదలైన సామజవరగమన పాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాపై ఉన్న బజ్ ఆ పాట సక్సెస్ ను చూస్తేనే అర్థం అవుతుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా బన్నీ కెరీర్ లో టాప్ చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు.
× RELATED కొవిడ్ ఎఫెక్ట్.. సెల్ ఫోన్లు.. ఏసీలు.. ఫ్రిజ్ లు అన్నింటికి ధరాఘాతమే
×