ఫొటో స్టోరీ : డోసు పెంచిన శ్రీదేవి డాటర్

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన విషయం తెల్సిందే. ధడక్ చిత్రంతో హీరోయిన్ గా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన జాన్వీ మొదటి సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయినా హీరోయిన్ గా.. నటిగా మంచి మార్కులు పొందింది. భవిష్యత్తులో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందని మొదటి సినిమాతోనే అనిపించుకుంది.

బాలీవుడ్ హీరోయిన్స్ అంటే గ్లామర్ విషయంలో లిమిట్స్ ఉండకూడదు. ఎక్స్ పోజింగ్ విషయంలో చాలా బోల్డ్ గా ఉండాలి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దాదాపు అంతా కూడా కళ్లు చెదిరే ఎక్స్ ఫోజింగ్ చేసిన వారే. ఆ స్థాయిలో చేరాలంటే తాను కూడా ఎక్స్ పోజింగ్ కు అడ్డు చెప్పకూడదని జాన్వీ కపూర్ ముందే అనుకున్నట్లుగా ఉంది. ఆమె మొదటి నుండి హాట్ ఫొటో షూట్ లు చేస్తూనే ఉంది.

ఇటీవల జాన్వీ కపూర్ మరో హాట్ ఫొటోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. రెడ్ డిజైనర్ డ్రస్ లో జాన్వీ కపూర్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్ లో ఈ రెండ్ హాట్ డ్రస్ లో పాల్గొంది. అక్కడ రెడ్ డ్రస్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం కరణ్ జోహార్ చిత్రంతో పాటు తన తండ్రి నిర్మించబోతున్న చిత్రంలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈమెను సౌత్ లోకి తీసుకు వచ్చేందుకు పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా సౌత్ లో నటిస్తానంటూ జాన్వీ కపూర్ గతంలోనే ప్రకటించిన విషయం తెల్సిందే.
× RELATED బతికి ఉండగానే నా శ్రద్ధాంజలి ఫొటో నేను చూసుకున్నా
×