బిగ్ బాస్: ఆ ఇద్దరు ఎలిమినేట్ కావడం ఖాయమేనా...!

ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ షోలో నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠత రేపుతోంది. ప్రతి వారం ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమయ్యాక ఇంతవరకు డబుల్ ఎలిమినేషన్ జరగలేదు. ఒకసారి డబుల్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పి రాహుల్ - హిమజలని ఇంటి నుంచి బయటకు పంపారు. అయితే ఇందులో రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. రాహుల్ మళ్ళీ తిరిగి ఇంటిలోకి వచ్చి గేమ్ ఆడుతున్నాడు.

ఇక ఈ వారంలో ఎలిమినేషన్ జోన్ లో ఇంటిలో ఉన్న 7 గురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఆదివారం ఎపిసోడ్ నుంచి ఒకరు బయటకు వెళ్ళతారు. కాకపోతే ఇంతవరకు డబుల్ ఎలిమినేషన్ జరగలేదు కాబట్టి ఈసారి జరిగే అవకాశముందని తెలుస్తోంది. దాని ప్రకారం చూసుకుంటే హౌస్ లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి...మిగిలిన 5 గురు ఫైనల్ కు చేరుకుంటారు. అయితే ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా వితికా - శివజ్యోతిలు వెళ్లిపోతారనే తెలుస్తోంది.

అలా కాకుండా ఒక్కరే ఎలిమినేషన్ కావాల్సి వస్తే...వితికా బయటకు వెళ్ళడం ఖాయమంటున్నారు. ఇక ఇదే విషయాన్ని శనివారం ఎపిసోడ్లో బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చిన కంటెస్టంట్స్ బంధువులు కూడా తేటతెల్లం చేశారు. రిలేటివ్స్ని బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకువచ్చిన నాగార్జున.... వాళ్లతో ఓ ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించారు. వాళ్లు తెచ్చిన గిఫ్ట్స్తో పాటుగా ఎవరు సేవ్ అయ్యారనే కార్డ్ ను కూడా ఆ గిఫ్ట్ లో జతచేశారు. ఈ టాస్క్ ప్రకారం ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏడుగురి ఫొటోలను ఒక బోర్డ్ మీద ఉంచి వీళ్లలో టాప్ 5 కంటెస్టెంట్స్ కాకుండా అర్హత లేదనుకుంటున్న ఇద్దర్ని వేరు చేయాలని టాస్క్ ఇచ్చారు.

దీంతో అర్హత లేని వారిలో వితికా పేరు ఎక్కువగా చెప్పారు. ఆ తర్వాత శివజ్యోతి - అలీ పేర్లు చెప్పారు. దీని ప్రకారం చూసుకుంటే మొదట వితికా ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే అలీ - శివజ్యోతిల్లో ఒకరు వెళ్లిపోతారు. ఇక శనివారం ఎపిసోడ్ లో రిలేటివ్స్ తెచ్చిన గిఫ్ట్ కార్డుల్లో శ్రీముఖి - రాహుల్ - బాబా పేర్లు రావడంతో - వారు ముగ్గురు సేఫ్ అయ్యారు. వరుణ్ - శివజ్యోతి - అలీ - వితికాలు ఇంకా నామినేషన్ లో ఉన్నారు.
× RELATED ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేపిన తండ్రి
×