'డిస్కోరాజా' నువ్వునాతో ఏమన్నావో.. అదుర్స్

రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' విడుదలకు సిద్దం అవుతుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్‌ సాంగ్‌ నువ్వు నాతో ఏమన్నావో.. ను విడుదల చేశారు. థమన్‌ సంగీతం అందించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. పాటకు మంచి స్పందన వస్తుంది. పాటలోని లిరిక్స్‌ ను చక్కగా అర్థం అవుతూ ఒక ఫీల్‌ గుడ్‌ మ్యూజిక్‌ తో సాగింది. బాలసుబ్రమణ్యం గారి వాయిస్‌ తో పాటకు ప్రాణం వచ్చినట్లుగా అనిపిస్తుంది.

పాటలోని ప్రతి పదం కూడా సిరివెన్నెల గారి అద్బుతమైన రచన పటిమను చెప్పకనే చెబుతున్నాయి. థమన్‌ చాలా కూల్‌ గా ఒక పాత మెలోడీ పాటను తలపించేలా ఆకట్టుకునేలా ట్యూన్‌ చేశాడు. ఇటీవలే సామజవరగమన పాటతో యూట్యూబ్‌ లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన థమన్‌ మరోసారి ఈ పాటతో దుమ్మ లేపడం ఖాయం అనిపిస్తుంది. పాట విడుదల ఒక రోజు కూడా కాకుండానే దాదాపుగా 7 లక్షల వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. మరి కొన్ని గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ ను రీచ్‌ కాబోతుంది.

పాట ప్రేక్షకులకు బాగా రీచ్‌ అవుతున్న నేపథ్యంలో యూట్యూబ్‌ లో ఈ పాట ముందు ముందు భారీగా వ్యూస్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. పాట విజువల్స్‌ కూడా చాలా ఆకట్టుకుంటున్నాయి. పాట ఆరంభంలో ఒక పాత తరం బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీని చూపించి అందులో టైటిల్స్‌ వేసి పాటను ప్రారంభించారు. పాట ఆరంభంలో వచ్చే హమ్మింగ్‌ కూడా చాలా అట్రాక్టివ్‌ గా ఉంది. మొత్తానికి సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే సినిమాపై అంచనాలను పీక్స్‌ కు చేర్చేలా పాట ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.


× RELATED కలెక్షన్స్ కోసం డిస్కోరాజా 'చిరు' ప్రయత్నం
×