31 రాత్రి జాతర.. కొరియోగ్రాఫర్స్.. యాంకర్లదే!

డిసెంబర్ 31 రాత్రి మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కి నగరాల్లోని క్లబ్బులు.. పబ్బులు.. ఔట్ స్కర్ట్ రిసార్టులు ఆత్రంగా వెయిట్ చేస్తున్నాయి. 2019 కి టాటా చెప్పి 2020కి వెల్ కం చెప్పడం అంటే ఆషామాషీనా?  న్యూ ఇయర్ సెలబ్రేషన్ అదిరిపోవాలి. రేతిరంతా జాగారంతో యూత్ చిలౌట్ చేసేందుకు యమ ఉత్సాహంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

అందుకే ఈ వేడుకలకు ప్లానింగ్ ఏ రేంజులో ఉంటుందో అర్థం ఊహించుకోవచ్చు. ఈసారి రెండు నెలల ముందుగానే అదిరిపోయే ప్లానింగ్ తో రెడీ అవుతున్నారు ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వాహకులు. ఇక ఈ ఈవెంట్ కి ఒక్కో అందాల కథానాయిక తమ రేంజును బట్టి డిమాండ్ చేస్తుండగా.. ఈ వేడుకలకు కొరియోగ్రఫీ అందించే కొరియోగ్రాఫర్లు.. యాంకరింగ్ చేసే యాంకర్లు దండీగానే దండుకుంటున్నారు. ఆ ఒక్క రాత్రి సంపాదన ఊహించనంత అంటే అతిశయోక్తి కాదు.

ఒక ఈవెంట్ కి డాన్స్ ట్రూప్స్ (5-7 మెడ్లీస్) చేస్తే ఎంత ముడుతుంది అంటే..?

సత్య మాస్టర్ డాన్స్ ట్రూప్ –10-12 లక్షలు
నటరాజ్ డాన్స్ ట్రూప్ - 10-15 లక్షలు
సురేష్ వర్మ డాన్స్ ట్రూప్- 7-10 లక్షలు
శ్రీధర్ డాన్స్ ట్రూప్ -5 లక్షలు
అభి రామ్ ట్రూప్ -1-2 లక్షలు
బాబీ డ్యాన్స్ ట్రూప్ -2-2.5 లక్షలు
మహేష్ డ్యాన్స్ ట్రూప్ -2-3 లక్షలు
గోవింద్ డ్యాన్స్ ట్రూప్ -3-5 లక్షలు
సుందర్ డ్యాన్స్ ట్రూప్ - 1 నుండి 2 లక్షలు
చార్లీ డ్యాన్స్ ట్రూప్ -3 లక్షలు
విజయ్ ఎటిఎ డాన్స్ ట్రూప్ -1–1.5 లక్షలు

గమనిక: 8 మంది మేల్.. 8 మంది ఫీమేల్ డ్యాన్సర్లు ప్రదర్శన ఇస్తారు
కాస్టూమ్స్ - సెట్ ప్రాపర్టీస్ - వసతి & ప్రయాణం (అదనపు ఛార్జీలు)

యాంకర్లు (వ్యాఖ్యాతలు) 3-4 గంటలు యాంకరింగ్ చేయాలంటే ఎంత వసూలు చేస్తారు? అంటే..

సుమ - 10 లక్షలు
రేష్మి గౌతమ్ - 10 లక్షలు
ఝాన్సీ - 4-5 లక్షలు
మంజూష -3 లక్షలు
ఉదయ్ భాను -4-5 లక్షలు
అనసూయ -7-10 లక్షలు
శిల్పా చక్రవర్తి .. 2-2.5 లక్షలు
శ్యామల -3-4 లక్షలు
గాయత్రి భార్గవి -2 లక్షలు
ఆర్జే కాజల్ & చైతు - 3-4 లక్షలు
రవి-3-4 లక్షలు
విష్ణు ప్రియా - 2-3 లక్షలు
వర్షిణి - 3 లక్షలు
ప్రదీప్ -5-7 లక్షలు
విజయ లక్ష్మి & భాను -1.5 - 2 లక్షలు
మేఘన-1.5 లక్షలు
నేహా మౌనికా -50 కే
కావ్య శ్రీ- 75 కే
ఐశ్వర్య -75 కే
ఆర్జే శ్వేత -1-1.5 లక్షలు
తేజస్విని-1 లక్షలు
శిరీష-75 కే
× RELATED 22 ఏళ్లలో ఢిల్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన మహిళలు 31 మందేనా!
×