ఫోటో స్టోరీ: చిరుత చెల్లి సూపర్ విండో

సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండేవారికి ఐష శర్మ పేరు తెలిసే ఉంటుంది.  ఒకవేళ తెలీదు అంటే 'చిరుత' మూవీ ఫేం నేహ శర్మకు చిట్టి చెల్లి అని పరిచయం చేయాలి. పేరుకు చెల్లి కానీ హాట్ నెస్ లో అక్కను ఎప్పుడో దాటేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఘాటు ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల హృదయాలను వేడినూనెలో బజ్జీలను వేయించినట్టుగా వేయిస్తుంది.  రీసెంట్ గా మరోసారి అదే పని చేసింది.  

తన ఫోటోలను పోస్ట్ చేస్తూ "సాషాతో బుధవారం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఈ సాషా ఎవరనుకున్నారు?  పూర్తిపేరు సాషా జయరామ్. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్.  పూజా హెగ్డే లాంటి చాలామంది బ్యూటీలకు ఫోటో షూట్లు చేస్తుంటుంది.  ఇక ఫోటో విషయానికి వస్తే వెరైటీగా ఉండే ఒక వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించింది. సహజంగా డీప్ నెక్ డిజైన్స్ ఎప్పుడూ వీ నెక్ ఉంటాయి. కానీ ఇది డిఫరెంటు.. ఉల్టా పల్టా వీ నెక్..  అయినా అందాల ప్రదర్శనకు అణువంత కూడా అడ్డురాలేదు. పైగా ఫోటోను డబల్ హాటుగా మార్చింది. కాస్త గజిబిజిగా ఉన్న హెయిర్ స్టైల్ .. రెండు చేతులను తలపై పెట్టుకుని సూపర్ స్మైల్ ఇస్తూ పోజిచ్చింది ఐష.  ఫేస్ లో ఫుల్లుగా గ్లో ఉంది.  ఓవరాల్ గా అక్కకంటే హాటు అని మరోసారి నిరూపించింది.

ఈ ఫోటోకు నెటిజన్లు డంగైపోయి సూపర్ కామెంట్లు పెట్టారు. "సెక్సీ అండ్ బ్యూటిఫుల్".. "సూపర్ హాట్ బ్యూటీ".. "ఝకాస్ పోజ్".. "విండోస్ 2019" అంటూ స్పందించారు.  సినిమాల విషయానికి వస్తే ఐష చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు.  ఆ ఆఫర్ల కోసమే ఈ హాటు ఫోటో షూట్లు!
× RELATED షూటింగులు ప్రారంభమయ్యేది ఆ రోజేనా...?
×