జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి క్యూ కడుతున్న ఆ సామాజికవర్గం?

తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై కమ్మ సామాజికవర్గం బాగా ఆందోళన చెందుతూ ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయాక.. వారికి ప్రస్తుత నాయకత్వం మీద బాగా నమ్మకం పోయింది. చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడింది. ఆయన ఆరోగ్యం బాగోలేక అమెరికా వరకూ వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారని స్పష్టం అయ్యింది. మరోవైపు చంద్రబాబు నాయుడి మాట తీరు ఆశ్చర్యకరంగా ఉంది.

చంద్రబాబు నాయుడు పచ్చి బూతులు మాట్లాడి వినిపించేంత స్థాయికి వెళ్లిపోయారు. జగన్ మీద కూడా ఆయన తీవ్రమైన భాష ఉపయోగిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో మాట్లాడటం ముఖ్యమే కానీ - మాట్లాడాల్సింది బూతులు కాదు. వాటి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. చంద్రబాబు తీరును గమనించాకా.. ఆయన మానసిక పరిస్థితి మీదే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఇక లోకేష్ కథ  సరేసరి. లోకేష్ మొన్నటివరకూ సోషల్ మీడియాలో హడావుడి చేసేవారు. సోషల్ మీడియాలో మాత్రమే హడావుడి చేసేవారు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా లేకుండా పోయింది. లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతులు అనే భావన ఆల్రెడీ టీడీపీ వర్గాల్లో ఉండనే ఉంది.

సొంత సామాజిక వర్గం వారు కూడా లోకేష్ మీద విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. లోకేష్ తమను గట్టెక్కిస్తాడనే నమ్మకం వారిలో కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో మరో నేత అవసరం ఉందని టీడీపీ వాళ్లే గొణుక్కుంటున్నారు. టీడీపీ నేతలు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే.. టీడీపీని బాగా ఓన్ చేసుకునే కమ్మ సామాజికవర్గం మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ కు జై కొడుతూ ఉంది.

ఆయన రాజకీయాల్లోకి వచ్చి పార్టీ బాధ్యతలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారట. ఈ మేరకు ఎన్టీఆర్ ఇంటికి ఆ సామాజికవర్గం ప్రముఖులు క్యూ కడుతూ ఉన్నారని సమాచారం. చంద్రబాబుకు వయసు అయిపోయిందని - లోకేష్ చేత కాదని.. జూనియర్ రంగంలోకి రావాలని.. పార్టీని నిలబెట్టాలని వారు కోరుతూ ఉన్నారట.  ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తారా? ధైర్యంగా పార్టీ బాధ్యతలను కోరతాడా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.
× RELATED త్రివిక్రమ్ సినిమాకి ఎన్టీఆర్ పారితోషకం ఎంతో తెలుసా? NTR Remuneration in Next Movie with Trivikram
×