వినాయక్ లో అగ్ర హీరోలను చూస్తున్న నెటిజన్లు

ఎంతోమంది అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన వినాయక్ కు వరుసగా ప్లాప్స్ రావడంతో దర్శకుడిగా అవకాశాలు తగ్గడంతో నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తనని ప్రొడ్యూసర్ గా నిలబెట్టిన వినాయక్ పరిస్థితి చూసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వినాయక్ హీరోగా తన సంస్థలో 'సీనయ్య' అనే సినిమా నిర్మిస్తున్నాడు. తాజాగా వినాయక్ బర్త్ డే సందర్భంగా సినిమా పూజ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ పూజ కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు - సుకుమార్ - వంశీ పైడిపల్లి - అనిల్ రావిపూడి - కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ హాజరయ్యారు. సినిమా యూనిట్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అప్పుడే వినాయక్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో వినాయక్ ఒక కార్ గ్యారేజ్ లో రెంచ్ పట్టుకుని - మెడలో ఎరుపు రంగు టవల్ తో నడుస్తున్నట్టు ఉంది. ఇప్పుడు ఈ లుక్ ని వేరే హీరోలతో పోలుస్తున్నారు నెటిజన్లు. అతని విగ్ మోహన్ బాబులా ఉందని - ఫేస్ చిరంజీవిలా ఉందని - మెడలో టవల్ వేసుకుని పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తున్నాడని - ఆ వెనుక కార్ షెడ్ అదీ చూస్తుంటే జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ ని చూసినట్టుందని ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోలుస్తున్నారు. మొత్తానికి ఈ లుక్ లో వినాయక్ ఇదివరకటి కంటే చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ వయసులో కూడా యువ హీరోలతో పోటీ పడి తన బరువును 15 కేజీల వరకు తగ్గించుకుని ఈ సినిమాలో నటించడం విశేషం.


× RELATED వెటరన్ హీరోలకి మళ్లీ మళ్లీ అవే తిప్పలు
×