నెగిటివ్ స్టోరీలను జగన్ వద్దకు తీసుకెళ్లనీయడం లేదా!

ప్రతి రోజూ వార్తా పత్రికలన్నింటినీ తిరగేసేంత తీరిక ఏ ముఖ్యమంత్రికీ ఉండదు. ఉదయం లేస్తే సవాలక్ష పనులు. ఈ నేపథ్యంలో ఆయనకు పత్రికల్లో ప్రముఖంగా వచ్చే సమాచారాలను అందించడానికి సమాచార శాఖ అధికారులు ఉండనే ఉంటారు. ఐ అండ్ పీఆర్ లో ముఖ్యమంత్రి  కోసమ సమాచారం ఇచ్చే వాళ్లు ఉండనే ఉంటారు. ప్రతి  రోజూ పత్రికల్లో వచ్చే కథనాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లడం  రివాజు.

అయితే తెలివి మీరిన అధికారులు.. ఇప్పుడు కేవలం పాజిటివ్ స్టోరీస్ ను మాత్రమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. పొరపాటున కూడా నెగిటివ్ స్టోరీలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లడం లేదట. ప్రతి రోజూ ప్రధాన పత్రికల్లో ఏవైనా ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు వచ్చి ఉంటాయో - వాటిని మాత్రమే తీసుకెళ్లడం జరుగుతోందని సమాచారం.

జగన్ ప్రభుత్వం పై కొన్ని పత్రికలు అదే పనిగా నెగిటివ్ కథనాలను రాస్తూ ఉన్నాయి. వివిధ అంశాల గురించి తప్పుడు ప్రచారాలను - దుష్ప్రచారాలను కూడా సాగిస్తూ ఉన్నాయి. ఆ పత్రికలకు అది కొత్త కూడా కాదు. ఇలాంటి నేపథ్యంలో కూడా అలాంటి కథనాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేదట అధికారులు.

అనుకూల కథనాలను మాత్రమే తీసుకెళ్లి. .. జగన్ వద్ద భజన చేస్తూ ఉన్నారట. ఇలా చేయడం వల్ల పత్రికల్లో ఏం జరుగుతోందనే అంశం - వాటి కవరేజ్ ఎలా ఉందనే అంశం గురించి ముఖ్యమంత్రికి పూర్తిగా తెలిసే అవకాశాలు లేవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
× RELATED Adah sharma gorgeous Pics
×