పేకాటలో భార్యనే పందెం కాశాడు..!!

పేకాట వ్యసనం ఓ వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేసింది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యనే పేకాటలో పందెం కాశాడు. పందెంలో ఓడిపోవడంతో ఆటాడినవారికి భార్యను అప్పగించాడు. వారు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఎలాగోలా వారి నుంచి బయటపడిన ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

ఉత్తరప్రదేశ్ లోని కల్యాణ్ పూర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. కల్యాణ్ పూర్  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జూదం - మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ నెల 15న తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి పేకాట మొదలెట్టాడు. చేతిలోని డబ్బంతా అయిపోయింది. ఆడడానికి సొత్తు కనిపించలేదు. చుట్టూ చూస్తే భార్య కనిపించింది. దాంతో భార్యను పందెం కాశాడు. ఆ ఆటలోనూ అతడు ఓటమి పాలయ్యాడు.

ఆటలో గెలిచినవారు కూడా అంతే మూర్ఖంగా వ్యవహరించారు. పేకాటలో గెలుచుకున్న ఆ మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఓడిపోయి నిస్సహాయస్థితిలో ఉన్న భర్త వారి చెర నుంచి భార్యను రక్షించుకోలేకపోయాడు. అయితే నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం ఇది భార్యభర్తల గొడవంటూ నిందితులను వదిలిపెట్టారు. పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు మాత్రం తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది.


× RELATED తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
×