ఫోటో స్టొరీ: భూమ్మీదకు వచ్చిన దేవత

బాలీవుడ్ లో ఉన్న టాప్ లీగ్ స్టార్ హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరు. దాదాపు అందరూ టాప్ బాలీవుడ్ స్టార్లతో నటించడమే కాకుండా బ్లాక్ బస్టర్లు సాధించిన అనుష్కను ఈమధ్య మాత్రం పరాజయాలు పలకరించాయి. షారూఖ్ ఖాన్ తో నటించిన 'జీరో' డిజాస్టర్ గా నిలవడంతో  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొత్త సినిమాకు సైన్ చేసేలోపు ప్రియమైన శ్రీవారు విరాట్ కోహ్లితో సరదాగా గడుపుతోంది.  

ప్రస్తుతం విరాట్ - అనుష్క జంట హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు. లొకేషన్ ఎక్కడో తెలియదు కానీ ఈ పాడులోకానికి దూరంగా ఒక బీచ్ రిసార్టులో సేదదీరుతున్నారు.  అనుష్క తన ఇన్స్టా ఖాతా ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.  ఈ ఫోటోలలో అనుష్క సముద్రంలో ఈత కొడుతూ తుళ్ళిపడుతూ.. కిలకిలా నవ్వుతోంది. మరి ఈ ఫోటోలను తీసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఎవరనేది అనుష్క వెల్లడించలేదు కానీ తప్పనిసరిగా ఆ వ్యక్తి శ్రీమాన్ విరాట్ కోహ్లిగారే అయి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.  బ్యాట్ పట్టుకొని ఫోర్లు సిక్సర్లు కొట్టాల్సిన మేటి ఆటగాడి చేతిలో కెమెరా పెట్టి.. ఫోటోలు తీయించుకోవడం ఒక్క భార్య తప్ప ఈ భూప్రపంచంలో ఇంకెవరు చేయగలరు చెప్పండి?

ఈ ఫోటోలకు అనుష్క "వాటర్ బేబీ" అనే క్యాప్షన్ ఇచ్చింది.  మల్టి కలర్ బికినీధరించి నీటిలో నవ్వుతూ ఉన్న అనుష్క ను చూస్తే హ్యాపీనెస్ కు ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తోంది.  నెటిజన్లు కూడా అలానే ఫీల్ అయ్యారేమో కానీ లక్షలకొద్ది లైక్స్ కొట్టారు.  కామెంట్లు కూడా అదిరిపోయాయి.  "దేవత పొరపాటున భూమికి వచ్చిందేమో".. "కోహ్లి: ది పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్".. "మిసెస్ కోహ్లి ఈజ్ బ్యూటిఫుల్" అంటూ తమ స్పందన తెలిపారు.
× RELATED అంతరిక్షంలో అనారోగ్యం.. భూమి నుంచే వైద్యం