స్పెషల్ వ్యక్తి ఉన్నాడంటున్న డింపుల్ బ్యూటీ

డింపుల్ బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఇండియాలోని అన్ని ముఖ్యమైన వుడ్లను కవర్ చేసింది. ప్రస్తుతం హిందీపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. బాలీవుడ్ లో ఎక్కువ మంది హీరోయిన్లు ఉత్త గ్లామర్ తోనే నెట్టుకొస్తుంటారు.  కానీ తాప్సి అలా కాదు.. లుక్స్ పరంగా సూపర్ కాకపోయినా నటనతో అందరినీ మెప్పిస్తుంది.  రియల్ లైఫ్ లో తాప్సీ ఒక స్ట్రాంగ్ లేడీ.  చాలా అంశాలపై తన అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పేస్తుంది.  

అంతా బాగానే ఉంది కానీ తన లవ్ స్టొరీ బయటకు రాకుండా ఇప్పటివరకూ జాగ్రత్తపడింది.  అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చింది. "నాకు పెళ్ళి కాలేదు.  ఈ విషయంలో పుకార్లు పుట్టించకండి" అంటూ సినిమాకు ముందు ముకేష్ యాడ్ లా ఒక భయంకరమైన హెచ్చరిక లాంటి సూచన చేస్తూ "నా జీవితంలో ఉండే వ్యక్తి జనాలు ఆసక్తిగా చూసే ప్రొఫెషన్లో లేడు. అతను నటుడూ కాదు.. క్రికెట్ ఆటగాడూ కాదు. అసలు ఇక్కడి వ్యక్తి కాదు" అంటూ తన జీవితంలోని స్పెషల్ వ్యక్తి గురించి హింట్ ఇచ్చింది.  అయితే ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడివాడు కాదు అంటే వేరే దేశవాసి అనే అర్థమా..  ఆ 'అజ్ఞాతవాసి' ఎవరనే కొత్త అనుమానాలను నెటిజన్లకు తెప్పించింది.

తన జీవితంలో ఎంతో మంది జఫ్ఫాలను కలిసిన తర్వాత ఫైనల్ గా ఆ రాకుమారుడిని కలిసినట్టు వెల్లడించింది.  ఇక పెళ్ళి గురించి మాట్లాడుతూ తనకు పిల్లలు కావాలి అనిపించినప్పుడు వివాహం చేసుకుంటానని తెలిపింది.  పెళ్ళి.. పిల్లల సంగతి పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటే తాప్సి ప్రస్తుతం 'సాంద్ కీ ఆంఖ్' చిత్రంలో నటిస్తోంది.  

 
× RELATED కాంస్య సుందరి మత్తెక్కిస్తోంది