నాయిని కాంప్రమైజ్.. టీఆర్ ఎస్ వాళ్లదేనట!

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత 'ధూం..ధాం..' అంటూ చిందులు తొక్కిన  మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కాంప్రమైజ్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దంటూ నాయిని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవిని అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని..అయితే ఆ హామీని నిలుపుకోలేదని నాయిని అసహనం వ్యక్తం చేశారు. మీడియా ముందు చిందులు తొక్కినట్టుగా వార్తలు వచ్చాయి.

తన అల్లుడికి ఎమ్మెల్సీ  పదవి అంటూ కూడా హామీ ఇచ్చారని నరసింహారెడ్డి వాపోయారు. అది కూడా జరగలేదన్నారు.  తెలంగాణ రాష్ట్ర సమితికి తను కూడా ఓనర్ నే అంటూ - కిరాయిదార్లు బయటకు వెళ్లాలంటూ వ్యాఖ్యానించారు నాయిని. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండిన నాయిని అలా వ్యాఖ్యానించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నాయిని లాంటి సీనియర్లు కేసీఆర్ కు సన్నిహితులే అలా మాట్లాడితే - టీఆర్ ఎస్ పరిస్థితి ఏమిటనే ఆశ్చర్యాలు కలిగాయి.

ఈ నేపథ్యంలో నాయినితో కేటీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీంతో నాయిని మెత్తబడ్డారట. ఆ విషయాన్ని ఆయనే చెప్పినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేటీఆర్ తనతో మాట్లాడరని - తను చిట్ చాట్ గా మాట్లాడితే.. మీడియా వాటిని హైలెట్ చేసిందని తను వివరణ ఇచ్చినట్టుగా నాయిని ప్రకటించుకున్నారు. అంతే గాక.. కేసీఆర్ పిలిస్తే తను  వెళ్లి మాట్లాడతానంటూ కూడా ఆయన మీడియాకు ఇప్పుడు చెబుతున్నారు. మొత్తానికి నాయిని కాంప్రమైజ్ అయినట్టే అని పరిశీలకులు అంటున్నారు.


× RELATED కబ్జాలు చేస్తే శిక్షిస్తాం: టీఆర్ఎస్ కు మావోయిల హెచ్చరిక