ఇమ్రాన్ కు ట్రంప్ ఫోన్..చెప్పాల్సింది చెప్పేసినట్లేనా?

మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి వేళ భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు ఫోన్ చేయటం.. దాదాపు అరగంట సేపు మాట్లాడుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య కశ్శీర్ అంశానికి సంబంధించి చర్చ రావటం.. మోడీ చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పేయటం తెలిసిందే. భారత అంతర్గత అంశాల్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవటంతో పాటు.. వ్యాఖ్యలు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఇదే తీరుతో వ్యవహరిస్తే.. పరిస్థితులు.. పరిణామాలు ఎలా మారతాయన్న విషయాన్ని చెప్పాల్సిన రీతిలో మోడీ చెప్పేయటం తెలిసిందే.

కర్రపెత్తనం చేసేందుకు పెద్దన్నకు ఎంత ఇష్టమో తెలుసు. భారత్ లాంటి దేశం ఒకటి ముందుకొచ్చి.. అమెరికాను పెద్ద మనిషిని చేసి.. మా తరఫున కాస్త మాట్లాడండి అని అవకాశం ఇస్తే ఊరుకుంటుందా?  మోడీ ఫోన్ కాల్ తర్వాత గంటల వ్యవధిలోనే రియాక్షన్ వచ్చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ కు ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జమ్ముకశ్మీర్ అంశంలోకి పాక్ అనవసర జోక్యంపై భారత్ అభ్యంతరాల్ని చెప్పాల్సిన రీతిలో ఇమ్రాన్ కు ట్రంప్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల వేళ.. రెండు దేశాలు సంయమనం పాటించాలని ఇమ్రాన్ కు ట్రంప్ సూచించినట్లుగా సమాచారం. అనవసరమైన ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరాన్ని ఇమ్రాన్ కు చెబుతూనే.. ఆ అంశంపై భారత్ తో మితంగా మాట్లాడాలని ఇమ్రాన్ కు ట్రంప్ సూచన చేయటం చూస్తే.. అనవసరమైన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని చెప్పేసినట్లుగా చెప్పాలి.

కశ్మీర్ విషయంలో పాక్ ధోరణి ఎలా ఉండాలన్న విషయంలో మోడీ తాను చెప్పాల్సింది ట్రంప్ నకు చెప్పటమే కాదు.. దాయాది నుంచి తానేం కోరుకుంటున్న విషయాన్ని కూడా ట్రంప్ నకు అర్థమయ్యేటట్లు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీని ఫలితంగానే.. గంటల వ్యవధిలోనే ఇమ్రాన్ కు ఫోన్ చేసి ఇమ్రాన్ కు అర్థమయ్యేలా ట్రంప్ హితభోద చేసినట్లుగా తెలుస్తోంది. మరి.. ట్రంప్ ఫోన్ కాల్ ప్రభావం ఎంతన్న విషయం రానున్న రోజుల్లో ఇమ్రాన్ స్పందించే తీరుతో అర్థం కాక మానదు.
× RELATED జై ట్రంప్ ..జైజై ట్రంప్ .. ట్రంప్ తన భక్తుడిని కలుస్తారా !
×