హిందీ బిగ్ బాస్.. సల్మాన్ ఫీజు తెలిస్తే షాకే!

అన్నిచోట్లా `బిగ్ బాస్` కొత్త సీజన్లు వేడెక్కిస్తున్నాయ్. అటు తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా.. ఇటు తెలుగులో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ కొత్త సీజన్లు అంతకంతకు వేడెక్కిస్తున్నాయ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ పాశ్చాత్య సంస్కృతిని తెలుగు లోగిళ్లలోకి బలంగా తీసుకెళ్లిపోవడంలో విజయం సాధిస్తోంది. అదంతా అటుంచితే వీటన్నిటి కంటే దేశ విదేశాల్లో ఎక్కువ మాట్లాడుకునేది హిందీ -బిగ్ బాస్ గురించే. ఇప్పటికే సల్మాన్ హోస్ట్ గా బిగ్ బాస్ పెద్ద సక్సెసైంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3కి కలర్స్ చానెల్ సన్నాహాలు చేస్తోంది.

అందులో భాగంగా తాజాగా సల్మాన్ భాయ్ పై హిందీ బిగ్ బాస్ ప్రమో షూట్ చేస్తున్నారు. ఇక సల్మాన్ హోస్టింగ్ కి అన్ని రకాలుగా ప్రిపరేషన్స్ సాగిస్తున్నారు. సీజన్ 13కి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అభిమానులు దీని కోసం చాలా ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. సల్మాన్ హోస్టింగ్ లో పరిచయం కాబోతున్న కంటెస్టెంట్స్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ప్రోమోని షూట్ చేస్తున్నారు. అందులోంచి ఒక ఫోటోని సల్మాన్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో సల్మాన్ వర్కవుట్లు చేస్తూ స్మైలీ లుక్ తో కనిపిస్తున్నారు.

నాగిన్ నటి సురభి జ్యోతి .. హేట్ స్టోరి 4 నటుడు కరణ్ వాహి కూడా ఈ ప్రోమోలో సల్మాన్ తో పాటు కనిపించనున్నారు. సురభి జాగింగ్ చేసేప్పుడు ఒక పూల బోకేతో సల్మాన్ తన వెంటపడతాడు. అప్పుడు కరణ్ ఎంటరై ఆ బోకేని బలవంతంగా అతడి నుంచి లాక్కుంటాడు... ఇదీ ఫన్నీ ప్రోమో. గతంలోలా కాకుండా బిగ్ బాస్ హౌస్ సెట్ ని ముంబైలోనే డిజైన్ చేశారు. సీజన్ 13 మొదలవ్వకుండానే ఇప్పటికే ప్రతిరోజూ హెడ్ లైన్స్ లో వినిపిస్తూనే ఉంది. ఇంతకుముందు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకునేవారు. ఈసారి కేవలం హోస్ట్ సల్మాన్  గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ సీజన్ కి సల్మాన్ పారితోషికం ఎంత? అంటే 400కోట్లు అని ప్రచారమైంది. అతడు వారానికి 31కోట్లు అందుకుంటున్నాడని ముంబై మీడియాలో ప్రచారం సాగుతోంది.

కంటెస్టెంట్ల వివరంలోకి వస్తే.. ఈసారి ఫ్లాప్ హీరోయిన్- కత్రిన డూప్ జరీన్ ఖాన్..హాటీ సోనాల్ చౌహాన్ ఒకనాటి నాయిక మహిమా చౌదరి.. మేఘనా మాలిక్.. మహాక్షయ్ చక్రబర్తి.. దయానంద్ శెట్టి.. చంకీ పాండే.. రాజ్ పాల్ యాదవ్.. వారీనా హుసేన్.. దెబోలినా భట్టాచారిజీ.. అంకిత లోఖండే.. రాకేష్ వశిష్ఠ్.. మహికా శర్మ.. డానీ డీ.. జీత్ చిరాగ్ పాశ్వాన్.. విజేందర్ సింగ్.. రాహుల్ ఖండేల్వాల్.. హిమాన్ష్ కోహ్లీ .. ఫైజీ బూ.. రీతూ బేరి.. సిద్ధార్థ శుక్లా.. ఫాజిల్ హౌస్ మేట్స్ గా ఎంటర్ టైన్ చేయనున్నారు.


× RELATED బిగ్ బాస్ ను భలేగా వాడుతున్నాడుగా..!