తెలుగులో ఈమధ్య రెజినా కసాండ్రా జోరు తగ్గిన విషయం తెలిసిందే. రెజినా నటించిన చివరి తెలుగు చిత్రం '7' ఒక ఫ్లాప్. అంతకు ముందు చాలా గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా 'ఎవరు' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అడివి శేష్ హీరో. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
రెజీనా ఈమధ్య 'ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లాగా' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా ఒక బోల్డ్ గా ఉండే పాత్ర పోషించింది. సోనమ్ కు- రెజీనాకు మధ్య లవ్ స్టొరీ ప్రధానాంశంగా ఈ సినిమా సాగుతుంది. లెస్బియన్ లవ్ ఇండియన్ స్క్రీన్ కు కొత్త కాకపోయినా మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మాత్రం మొదటిసారే. ఆ సినిమా గురించి మాట్లాడుతూ లేడీ డైరెక్టర్ షెల్లీ చోప్రా ఒకరోజు తనకు కాల్ చేసి విధు వినోద్ చోప్రా ప్రొడక్షన్ హౌస్ నుండి కాల్ చేస్తున్నామని.. సినిమా కథ ఇలా ఉంటుందని.. మీకు నటిస్తారా అని అడిగారట. హిందీలో డెబ్యూ సినిమానే బోల్డ్ పాత్ర కావడంతో నిర్ణయం తీసుకునేందుకు కాస్త సమయం తీసుకుందట.
ఫ్రెండ్స్ ను చాలామందిని ఇలాంటి ఆఫర్ వచ్చింది.. చేయవచ్చా వద్దా అని అడిగితే దాదాపు అందరూ వద్దని చెప్పారట. కానీ తను మాత్రం ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని .. ఛాలెంజింగ్ పాత్రలను వదులుకోకూడదనే ఆలోచనతో ఒకే చెప్పిందట. బోల్డ్ వేరు వల్గారిటీ వేరు అని.. రెండిటి మధ్య తేడా ఉందని చెప్పింది. రెజీనా ఈ సినిమాలో వల్గారిటీ లేదని నిర్ధారించుకున్న తర్వాత యస్ చెప్పిందట. ఈ సినిమాలో వల్గారిటీ లేదు కనుకనే వివాదాస్పదం కాలేదని వెల్లడించింది. లెస్బియన్ పాత్రలో నటించడం ఒకరకంగా సమాజం లోని కట్టుబాట్లను ఎదిరించడమేనని చెప్పింది.