స్టార్ హీరో.. ఫెయిల్యూర్ లనూ ఆస్వాధిస్తున్నాడట!

ఈ మధ్య కాలంలో షారూక్ ఖాన్ కు హిట్స్ కరువు అయ్యాయి. షారూక్ సినిమాల సక్సెస్ రేటు ఈ మధ్య కాలంలో దారుణంగా పడిపోయింది. వరసగా వివిధ సినిమాలు రావడం ఫెయిల్యూర్స్ గా వెళ్లిపోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే వచ్చిన షారూక్ సినిమా 'జీరో' సంగతి చెప్పనక్కర్లేదు.

ముందుగా ఆ సినిమాపై మంచి అంచనాలే ఉండేవి. షారూక్ ప్రయోగాత్మకంగా ఆ సినిమాను చేశాడు కూడా. అయితే అందుకు తగిన ఫలితం దక్కలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అలా షారూక్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ యాడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో షారూక్ స్పందించాడు.

తన మరో సినిమా ఫెయిల్యూర్ కావడం పై షారూక్ భిన్నంగా స్పందించాడు. తన సినిమాలు ఈ మధ్య కాలంలో వరసగా ఫెయిల్ అవుతున్న విషయాన్ని షారూక్ ఒప్పుకున్నాడు. దీనిపై తన స్పందన తెలియజేస్తూ… విజయాలనే కాదు ఫెయిల్యూర్ లను కూడా ఆస్వాధించాలని షారూక్ అంటున్నాడు. తను చాలా కాలం పాటు సక్సెస్ లను మాత్రమే ఆస్వాధించినట్టుగా - ఇప్పుడు ఫెయిల్యూర్ లను ఆస్వాధిస్తున్నట్టుగా షారూక్ వ్యాఖ్యానించాడు.

అయితే తను మళ్లీ పూర్వపు ఫామ్ లోకి వస్తానంటూ షారూక్ వ్యాఖ్యానించాడు. తను హిట్ సినిమాలను తీసే సత్తాను ఇంకా కలిగి ఉన్నట్టుగా షారూక్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

   

× RELATED పాన్ ఇండియా ఆరాటం..స్టార్ హీరో పరువు తీస్తుందా?
×