టాప్ సీక్రెట్ : జగన్ గారూ..ఆ మంత్రి PA గల్లా పెట్టె ఓపెన్ చేశారట!

ఒకవైపు అవినీతి రహిత పాలనే లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి స్వార్థం - సంపాదనల లక్ష్యం లేకుండా తన పాలన సాగాలని జగన్ భావిస్తున్నారు. మంత్రి వర్గం ఎంపిక దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి అలాంటి వైఖరే అనురిస్తూ ఉన్నారు. అధికారులతో అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు.

అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండటంతో విధానపరంగా ఎలాంటి అవినీతి జరగనీయకూడదని జగన్ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఆ విషయంలో సక్సెస్ ఫుల్ గా సాగుతూ ఉన్నారాయన.

ఆ సంగతలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని మంత్రులు మాత్రం ఆ తీరులోసాగడం లేని అప్పుడే సమాచారం అందుతోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకుని నెల  అయినా గడిచిందో లేదో అప్పుడే కొందరు గల్లా పెట్టెలు తెరిచినట్టుగా వార్తలు వస్తున్నాయి.

వారిలో ఒక మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఏపీ సచివాలయంలోని బ్లాక్ నంబర్ త్రీలో ఉండే ఆ మంత్రి అప్పుడే వసూళ్ల దందా మొదలుపెట్టారని సమాచారం. ఏ ఫైల్ పై సంతకం పెట్టాలన్నా ఆయన బల్లకింద చేయి పెడుతూ ఉన్నారని సమాచారం. ఆయన తరఫున ఆయన పీఏ మొత్తం వసూళ్ల దందాను సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. తన రేటును పది వేల రూపాయలుగా చెబుతున్నాడట ఆ  పీఏ. మంత్రి దగ్గరకు ఫైల్ చేరడానికే ఆ మాత్రం అతడికి అందాలట. ఆ తర్వాతి సంగతి ఆ తర్వాత. ఆఖరికి సంతకాలు అయిన ఫైల్స్ ను కూడా ఆ పీఏ వదలడం లేదట.

ఇలా ఆ మంత్రి లంచాలు తీసుకుంటున్నాడనే వార్తల్లోకి అప్పుడే ఎక్కేశాడు. ఇవన్నీ గత ప్రభుత్వాల హయాంలోనూ జరిగినవే అయినా - ఇలాంటి మంత్రుల మీద జగన్ ఒక లుక్ వేయాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు.

× RELATED మిస్ అయిన మంత్రిగారి కడియం దొరికేసిందోచ్..