సాయి పల్లవి ఆ స్టాండ్ మీదే ఉండగలదా?

ఇప్పుడున్న ట్రెండ్ లో సావిత్రి సౌందర్యలా కేవలం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తానని హీరోయిన్లు అంటే నడిచే కాలం కాదిది. ఎంతో కొంత పట్టువిడుపు గ్లామర్ షోకు ఒప్పుకుంటేనే అవకాశాలు వెల్లువెత్తుతాయి. కానీ కేరళ పోరి ఫిదా భామ సాయి పల్లవి మాత్రం తన రూటే సెపరేటు అనే రీతిలో సాగుతోంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన రౌడీ బేబీ పాటలో ఇంచు నడుము కూడా కనిపించకుండా కేవలం తన స్టెప్పులతో ఉర్రూతలూగించడం ఒక్క సాయి పల్లవికే సాధ్యమని చెప్పాలి.

అయితే కెరీర్ మొదట్లో ఉన్నంత సక్సెస్ ఇప్పుడీ బ్యూటీకి లేదనే చెప్పాలి. ఇటీవల వచ్చిన సూర్య ఎన్జికె పాత్ర గురించి ఎన్ని విమర్శలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ఓ మాములు రోల్ ని ఎలా ఒప్పుకున్నావని అభిమానులే నిలదీశారు. నిజానికి సాయి పల్లవికి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పటికీ కేవలం తాను పెట్టుకున్న పరిమితుల వల్లే అవి మిస్ అవుతున్నాయని ఇన్ సైడ్ టాక్. డియర్ కామ్రేడ్ లో ముందు అనుకున్న ఛాయస్ తనేనట. కానీ కథ ప్రకారం లిప్ లాక్స్ ఉంటాయని దర్శకుడు భరత్ కమ్మ చెప్పడంతో నో చెప్పారని టాక్.

మహేష్ సరిలేరు నీకెవ్వరుకు ముందు వినిపించిన పేరు కూడా సాయి పల్లవే. ఈ రెండు రష్మిక మందన్నతో రీ ప్లేస్ అయ్యాయి. దీనికి కారణం మాత్రం బయటికి రాలేదు. సౌందర్య టైంలో ఇలాగే ఉండేవారు కానీ ఆఫర్స్ తగ్గాక అన్నయ్య-నరసింహ సినిమాల్లో కొంత పట్టువిడుపు చూపించారు. మరి సాయి పల్లవి స్టాండ్ మార్చుకుంటుందా లేక సినిమాలు వచ్చినా రాకపోయినా నా రూట్ ఇంతే అంటుందా కాలమే సమాధానం చెప్పాలి


× RELATED వీడియో : సాయి పల్లవి రికార్డు బ్రేక్ చేసేందుకు వచ్చిన గద్దలకొండ శ్రీదేవి