నిఖిల్ కు మళ్ళీ బ్రేక్ పడుతుందా ?

సాహో పోస్ట్ పోన్ చేయడం ఏమో కానీ మిగిలిన సినిమాల నిర్మాతలకు చుక్కలు కనపడుతున్నాయి. నిజానికి యువి సంస్థ సాహో అగస్ట్ 15 రావడం లేదని అఫీషియల్ గా చెప్పలేదు. అయినా లీకైపోయింది. దానికి తోడు రణరంగం-ఎవరు యూనిట్లు ఏకంగా పోస్టర్లు కూడా అదే డేట్ తో రిలీజ్ చేయడంతో ఇంకెలాంటి అనుమానాలకు తావు లేకపోయింది. ఇదిలా ఉండగా ఇంతకీ ఆగస్ట్ 30 అయినా లాక్ చేస్తారా అనేది ఖచ్చితంగా చెప్పడం లేదు.

ఒకవైపు అదే డేట్ ఫిక్స్ చేసుకున్న నాని గ్యాంగ్ లీడర్ సాహో నిర్ణయాన్ని బట్టి మారాల్సి ఉంటుంది. అది ఎప్పుడు వచ్చినా నానికున్న మార్కెట్ వల్ల పెద్దగా వచ్చి పడే ఇబ్బందేమీ లేదు కానీ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ నిఖిల్ అర్జున్ సురవరం అదే తేదీని అనుకుని ఇప్పుడు మరోసారి త్రిశంకు స్వర్గంలో పడిపోయినట్టుగా సమాచారం

రెండు రోజుల క్రితమే అర్జున్ సురవరంని ఆగస్ట్ 30కి రిలీజ్ చేయడం గురించి చర్చలు జరుగుతున్నట్టుగా న్యూస్ వచ్చాయి. ఈలోగా సాహో బాంబు పడటంతో సెప్టెంబర్ కు వెళ్లే పరిస్థితి తప్పేలా లేదు. నిజానికి రేపు రాబోయే ఇస్మార్ట్ శంకర్ నుంచి అక్టోబర్ లో వచ్చే సైరా దాకా అన్ని క్రేజ్ ఉన్న సినిమాలే క్యూ కట్టి ఉన్నాయి. మధ్యలో ఒకటో రెండో స్లాట్స్ ఖాళీ ఉన్నాయి.

కానీ వాటిని వేరొకరు కర్చీఫ్ వేసేలోగా అర్జున్ సురవరం నిర్మాతలు తొందరపడితే మంచిది. ఇప్పటికే చల్లారిపోయిన హైప్ ని తిరిగి బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. సరే అయిందేదో అయ్యింది అనుకుని పక్కాగా ఓ డేట్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ మొదటినుంచి ప్రమోషన్ మొదలుపెట్టొచ్చు. కానీ అసలైన ఈ విషయం తేలితేనేగా మిగిలినవాటి గురించి క్లారిటీ వచ్చేది

    
    
    

× RELATED నిఖిల్.. లైన్లో మూడు నాలుగు ప్రాజెక్టులు ?