ఈ లుక్ ఇస్మార్ట్ పూరీ వల్లే సాధ్యం

హీరో అంటే ఓ యూనిక్ మ్యానరిజం. హెయిర్ స్టైల్.. బాడీ లాంగ్వేజ్.. డ్రెస్ సెన్స్.. మేకప్ సెన్స్ .. వగైరా వగైరా వాటితో పాటు ఎక్స్ ప్రెషన్స్ .. నడక నడత ప్రతి మూవ్ మెంట్స్ లోనూ ఓ ప్రత్యేకత కనిపించాలి. ఎవరు పడితే వాళ్లను హీరోలుగా చూడలేం. అయితే ఈ బేసిక్ లైన్స్  విషయంలో హీరోలకు కరెక్షన్ నేర్పిన గురువుగా పూరి గురించే చెప్పాలి. టాలీవుడ్ లో అరడజను హీరోల లుక్  పూరితో సినిమా చేశాకే పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. రవితేజ- అల్లు అర్జున్ - మహేష్- ఎన్టీఆర్- నితిన్ - కళ్యాణ్ రామ్ వీళ్లందరినీ లుక్ పరంగా కొత్త మేకోవర్ తో చూపించింది పూరి జగన్నాథ్.

అందుకే `ఇస్మార్ట్ శంకర్` ఆఫర్ రాగానే ఎనర్జిటిక్ రామ్ ఏమాత్రం ఆలోచించలేదు. ఇన్నాళ్లుగా నటిస్తున్నా కెరీర్ లో ఇంత జోష్ ఎప్పుడూ చూడలేదంటూ అంగీకరించారు రామ్. పూరి మార్క్ అంటే ఇదే మరి. లేటెస్ట్ గా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ పోస్టర్ చూస్తేనే ఆ సంగతి అర్థమవుతోంది. ఈ పోస్టర్ లో రామ్ లుక్ మేకోవర్ మైండ్ బ్లోవింగ్. అతడి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అతడు ఇప్పుడు పెర్ఫెక్ట్. చబ్బీ లుక్ నుంచి పూర్తిగా మాస్ లుక్ కి మారి ఇంప్రెషన్ కొట్టేశాడు. రామ్ నెవ్వర్ బిఫోర్ లుక్ ఇదని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో త్రిశూలంతో రామ్ పరుగు తీస్తున్నాడు. అందులో ఎంతో ఎనర్జీ కనిపిస్తోంది. మాస్ అప్పీల్ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ కి ఈ లుక్ పూర్తిగా నచ్చింది కాబట్టే ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాక్సాఫీస్ కి ఇది పెద్ద ప్లస్ అవుతోంది.

ఈ శుక్రవారం రిలీజవుతున్న `ఇస్మార్ట్ శంకర్` పై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఆన్ లైన్ టికెటింగ్ లో క్రేజు ఉన్న సినిమాగా దూసుకెళుతోంది. ఇదంతా రామ్ కొత్త లుక్ నచ్చడం వల్లనే. టీజర్ మాస్ కి కనెక్టవ్వడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అయితే తొలి రోజు.. తొలి వీకెండ్ వసూళ్లను మినహాయిస్తే ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ రన్ ఎలా ఉండబోతోంది? అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైతే రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఖాయమైనట్టేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ సినిమా పూరీని బౌన్స్ బ్యాక్ చేస్తుందనే ఆశిస్తున్నారు అంతా.

    

× RELATED ఫోటో స్టోరీ: రకుల్.. మైండ్ బ్లాకింగ్ లుక్