నన్నే బ్యాన్ చేస్తారా.. ఈ క్రిమినల్స్?

క్వీన్ కంగన రనౌత్ వివాదాస్పద వైఖరిపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తనతో పెట్టుకుంటే ఎంత పెద్ద హీరోలు.. పలుకుబడి ఉన్న దర్శక నిర్మాతలకు అయినా ముప్పు తిప్పలు తప్పడం లేదు. ఇటవల పలు సందర్భాల్లో కంగన గొడవల గురించి తెలిసిందే. తాజాగా క్వీన్ దెబ్బకు బాలీవుడ్ జర్నలిస్టులు సైతం బెంబేలెత్తిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఓ జర్నలిస్టును పబ్లిక్ వేదికపైనే కంగన కించపరిచారు. దాంతో తనపై బ్యాన్ విధిస్తూ `ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్ గిల్డ్` సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టని కంగన జర్నలిస్టులకు కోర్టు నోటీసులు పంపడం సంచలనమైంది.

ఈ నోటీసుల్లో జర్నలిస్టులపై కంగన తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు `ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్ గిల్డ్` రిజిస్టర్డ్ ఫర్మ్ కానేకాదని ఆరోపించింది. ఒక వర్గం మీడియా జర్నలిస్టులు నిజాల్ని వక్రీకరించి నేరపూరితమైన ఉద్ధేశాలతో వ్యవహరిస్తున్నారని ఈ నోటీసుల్లో పేర్కొంది. కొందరు జర్నలిస్టుల పేర్లను మెన్షన్ చేస్తూ వీళ్లంతా నన్ను.. పరిశ్రమలో చాలా మందిని డీఫేమ్ చేసి వేధిస్తున్నారని నోటీసుల్లో పేర్కొంది. స్వేచ్ఛా వాక్కు పేరుతో `సోకాల్డ్ అన్ ప్రొఫెషనల్ జర్నలిస్టులు` నేరపూరితంగా  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కంగన ఆరోపించింది.

ఘటన జరిగినప్పుడు అక్కడ అసలేం జరిగిందో కూడా తెలుసుకోకుండా అన్ ప్రొఫెషనల్ గా ఉండే జర్నలిస్టులకు సిన్సియర్ జర్నలిస్టులు అండగా నిలవడం సరికాదని కంగన పేర్కొంది. కొందరు జర్నలిస్టుల క్రిమినల్ యాక్టివిటీస్ ని ఖండించకుండా వారికి సపోర్టుగా నిలవడం ప్రొఫెషనల్ జర్నలిస్టులకు తగదని కంగన హితవు పలికే ప్రయత్నం చేసింది. కంగన వ్యక్తిగత లాయర్ రిజ్వాన్ సిద్ధిఖి ఆ మేరకు నోటీసుల్లో ఈ బలమైన వాదాన్ని వినిపించారు. మొత్తానికి జర్నలిస్టులతోనే గొడవ పెట్టుకుంది క్వీన్. ఇక ఇది ఎంత దూరం వెళ్లనుందోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. కంగన నటించిన `జడ్జిమెంటల్ హై క్యా` త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సమయంలో తాజా వివాదం ఎలాంటి చిక్కులు తెచ్చి పెడుతుందో అన్న చర్చ సాగుతోంది.


× RELATED Romantic Criminals Movie Team Controversial Interview | Manoj Nandam | Avanthika | Sunil Kumar Reddy