అందరి చూపు ఆ కొరియోగ్రాఫర్ వైపే!

డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ `బాహుబలి`తో ఓ రేంజ్కి వెళ్లిపోయింది. `బాహుబలి` తరువాత ప్రభాస్ నుంచి  సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు స్కైని తాకుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `సాహో`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి బాలీవుడ్ ట్యాలెంటు తోడు కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. సుజీత్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రచారం పరంగా వేగం పెంచింది. `బాహుబలి`లో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్న ప్రభాస్ నుంచి ప్రేక్షకులు చాలానే ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే అదిరిపోయే స్టంట్స్తో పాటు స్టెప్స్ తోనూ డార్లింగ్ అలరించబోతున్నాడట.

ప్రభాస్ కోసం ప్రత్యేకించి బాలీవుడ్ క్రేజీ డ్యాన్సర్ వైభవీ మర్చంట్ ని చిత్ర బృందం రంగంలోకి దింపింది. బాలీవుడ్ లో పలు హిట్ సాంగ్స్ కి వైభవీ మర్చంట్ కొరియోగ్రఫీ అందించారు. రొమాంటిక్ నంబర్స్ స్పెషలిస్ట్ గా ఆమెకు మంచి పేరుంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంతో తెలుగులోనూ తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్ కు వైభవీ మర్చంట్ డ్యాన్స్ కంపోజ్ చేసింది. అయితే సినిమా ఫ్లాపవ్వడంతో ఆ పాటకు గుర్తింపు దక్కలేదు. దాంతో ఆమె ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా పోయింది.

`సాహో` చిత్రంలో వైభవీ మర్చంట్ రెండు మూడు పాటల్ని కంపోజ్ చేసింది. ఇందులో రెండు పాటల్ని ప్రభాస్- శ్రద్ధాకపూర్లపై ఆస్ట్రియాలో చిత్రీకరించారు. మరో పాటని పెప్పీ ఐటమ్ సాంగ్ గా బాలీవుడ్ హాటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై షూట్ చేసినట్టు తెలిసింది. దీంతో వైభవీ మర్చంట్ పై అందరి చూపు పడింది. బాలీవుడ్ లో టాప్ హిట్ సాంగ్స్ కి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి శభాష్ అనిపించుకున్న వైభవీ మర్చంట్ `సాహో`లో ఏ స్థాయిలో మ్యాజిక్ చేసిందో.. ఎలాంటి మెరుపులు మెరిపించిందోనంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


× RELATED 31 రాత్రి జాతర.. కొరియోగ్రాఫర్స్.. యాంకర్లదే!