ఆమంచి రాజేంద్ర నుంచి ప్రాణహాని.. ఫిర్యాదు!

తనకు ఆమంచి రాజేంద్ర నుంచి ప్రాణహాని ఉందని సూరిబోయిన రవికుమార్ రెడ్డి అనే హోంగార్డు ఈపురుపాలెం పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గత కొంతకాలం నుంచి తనకు తరచూ రాజేంద్ర నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దుర్భాషలాడుతూ తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని సదరు హోంగార్డు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు ఫోన్ కాల్స్ రికార్డ్ లకు సంబంధించిన డీవీడీల ను కూడా పోలీసులకు అందించారట ఆ హోం గార్డు.

తను ఈపురుపాలెం పోలిస్ స్టేషన్లోలోనే హోంగార్డుగా పని చేస్తున్నట్టుగా, గత నాలుగు రోజులు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమంచి రాజేంద్ర తనకు ఫోన్ చేసి తనను, తన పై అధికారులను, మొత్తం పోలీసులను మాటల్లో చెప్పలేనంత స్థాయి నీఛమైన పదజాలాన్ని ఉపయోగించి తిడుతూ ఉన్నాడని వివరించాడు.

తనతో పాటు మరి కొందరు పోలిస్ అధికారులను రాజేంద్ర తిడుతూ ఉననాడని, తన కాళ్లూ చేతులు నరికేస్తానంటూ హెచ్చరిస్తున్నాడని ఫిర్యాదులో వివరించాడు. ఆమంచి రాజేంద్ర నుంచి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఈ విషయమై విచారించి, తనకూ తన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరాడు రవి కుమార్ రెడ్డి అనే ఆ ఆ హోం గార్డు.

 

 

× RELATED క‌ర‌క‌ట్ట భ‌వనాన్ని కూల్చొద్దు.. హైకోర్టు ఆదేశం
×