గవర్నర్ తో జగన్ - ఏంటి కథ ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కీలక అంశాలపై చర్చించేందుకు భేటీ అయ్యారని తెలుస్తోంది.

జగన్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో ప్రజలకు ఆమోదదాయకంగా ఉండేలా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. 12వ తేదీన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర బడ్జెట్ ఏపీని తీవ్ర నిరాశకు గురిచేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రజలకు ఏ లోటు రాకుండా ఈ బడ్జెట్ రూపొందించారు. కొన్ని ముఖ్యాంశాలపై ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ ను కలిశారు.

× RELATED క‌ర‌క‌ట్ట భ‌వనాన్ని కూల్చొద్దు.. హైకోర్టు ఆదేశం
×