లోకేష్ గ్యాంగ్ అంత ప‌ని చేసిందా...

అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధ‌వ్‌కు ఘోర‌ అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. తన ఆహ్వానం మేరకు ఈ సభకు హాజరైన రామ్‌మాధ‌వ్ వేదికపై ప్రసంగిస్తుండగా ఆయన ప్రసంగానికి అక్కడ కొందరు స‌భికులు అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. రామ్ మాధవ్ ప్రసంగిస్తుండగా తానా సభకు హాజరైన ప్రవాసాంధ్రులు ఒక్కసారిగా పైకి లేచి గోల గోల చేశారు. ఒక్కసారిగా నిశ్చేష్టుడైన రామ్ మాధవ్ మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపేశారు. దీంతో తానా అధ్యక్షుడు సతీష్ వేమన వేదిక మీదికి వచ్చి బిజెపిలో కీలక పదవిలో ఉన్న రామ్‌మాధ‌వ్ గారు మాట్లాడుతుండగా ఇలా అడ్డుతగలడం సమంజసం కాదని వార్నింగ్ ఇచ్చారు.

అప్ప‌టికే ఆయ‌న ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి. చివరకు ఆయ‌న‌ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయ‌గా సతీష్ వేమన ఆయనకు సన్మానం చేసి పంపేశారు. ఇదిలా ఉంటే రామ్‌మాధ‌వ్ ప్రసంగాన్ని తానా సభ్యులు అడ్డుకోవడంపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్లో టిడిపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు అవి తానా స‌భ‌లు కావని... టిడిపి భజన సభలని ఎద్దేవా చేశారు. పచ్చ తమ్ముళ్లు అమెరికాలోనూ ఇలాంటి చర్యల ద్వారా తెలుగు వారి ప్రతిష్టను దిగజార్చుతున్నార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామ్‌మాధ‌వ్ గారి జాతీయవాద ప్రసంగానికి అడ్డు తగలడం ద్వారా లోకేష్ గ్యాంగ్ ఆయ‌న్ను తీవ్రంగా అవమానించి... త‌మ నీచ‌బుద్ధిని బయటపెట్టుకుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని కన్నా ఏపీలో టీడీపీ చేసిన బుర‌ద రాజకీయాల నుంచే కమల వికాసం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఏదేమైనా తానా సభల్లో రామ్ మాధవ్ కు జరిగిన అవమానంపై బీజేపీ శ్రేణులు టిడిపిని టార్గెట్ చేసుకుని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ వైరుధ్యం ఉన్న నేపథ్యంలో దీనిని కూడా అవకాశంగా తీసుకొని బిజెపి టిడిపిపై ఎటాక్‌కు దిగుతుంది.

× RELATED ప్రేమాయాణం న‌డిపాం..ఇప్పుడు తాళి అంతేన‌న్న జేసీ!
×