అసెంబ్లీ, సచివాలయ కూల్చివేతకు హైకోర్టు బ్రేక్

అనుకున్నట్టే అయ్యింది. తెలంగాణ సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ భవనాలపై తాజాగా సోమవారం దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు కౌంటర్ కోసం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు గడువు ఇచ్చింది. ఆ తర్వాత నేరుగా వాదనలు విన్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అప్పటిదాకా ఈ భవనాలను కూల్చివేయకూడదని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత నెల 27న కేసీఆర్ కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం భూమిపూజ కూడా చేశారు. త్వరలోనే పాత సచివాలయం, ఎర్రమంజిల్ కూల్చివేతకు నిర్ణయించారు. అయితే ఈలోగానే నిన్న అఖిలపక్షాలు, ప్రజాసంఘాలు హైదరాబాద్ లో భేటి అయ్యి ఈ కూల్చివేతలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కోవలోనే సోమవారం పిటీషన్లను దాఖలు చేయగా కోర్టు దీనిపై ప్రభుత్వ సంజాయిషీ కోరుతూ ఆ తర్వాత తీర్పు చెబుతామని ప్రస్తుతానికి ఆ భవనాలు కూల్చవద్దంటూ ఆదేశాలిచ్చింది.

ఈ పరిణామం తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాక్ లా మారింది. త్వరగా కూల్చిసి దసరా వరకు కొత్త సచివాలయం, అసెంబ్లీని కడుదామనుకుంటున్న ఆయన ఆశలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మరి కౌంటర్ గా కేసీఆర్ హైకోర్టుకు ఏం చెప్తారు. ఆ భవనాలను కూల్చడం సాధ్యపడుతుందా లేదా అన్నది ఇక హైకోర్టు చేతుల్లోకి వెళ్లింది.

× RELATED అన‌ర్హ‌త‌పై ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌కు ఎదురుదెబ్బ‌!
×