కూతురుతో కేజీఎఫ్ స్టార్ బంధం

కంటే కూతురునే కనాలి! అంటూ దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఏకంగా సినిమానే తీశారు. దానికి అక్షరాలా తూ.చ తప్పక పాటించాడు కేజీఎఫ్ స్టార్ యశ్. తన గారాలపట్టీతో యశ్ ఎంత ప్రేమగా ఉంటాడో ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పేయొచ్చు. ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా అతడి భార్య రాధిక ఈ అరుదైన ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఇక ఇందులో ఎంతో అమాయకంగా క్యూట్ గా కనిపిస్తున్న యశ్ కుమార్తె డాడ్ తో కలిసి కెమెరా ఫ్రెండ్లీగా అదిరిపోయే ఫోజిచ్చింది. అసలు ఈ కెమెరాలేంటి.. ఆ హడావుడి ఏంటి? అన్నట్టే ఏడాది వయసున్న చిన్నారి అలా చూస్తూ ఉండిపోయింది. ఆ లుక్ గుండెల్ని టచ్ చేస్తోంది. ఇక తన కూతురుని ముద్దాడేస్తూ యశ్ ఎంతో మురిపెం చూపిస్తున్నాడు.

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణలో యశ్ ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడు చోట్ల భారీ సెట్స్ ని వేస్తున్నారట.  తొలి భాగంతో పోలిస్తే పదింతలు భారీ యాక్షన్ సీక్వెల్ లో ఉంటుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.


× RELATED కేజీఎఫ్ స్ఫూర్తి తో దాడి.. వీడియో వైరల్