ఆ స్టార్ హీరో హీరోయిన్ లను పప్పూస్ అనేసింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉంటున్న విషయం తెల్సిందే. కంగనా రనౌత్ గతంలో పలు సార్లు బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు చేయడం.. బాహాటంగానే వారిపై విమర్శలు చేయడం చేసింది. అందుకే కంగనాకు బాలీవుడ్ లో చాలా మంది శత్రువులు ఉన్నారని అంటూ ఉంటారు. ఇప్పుడు కంగనా సోదరి రంగోలీ కూడా స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమె ఎక్కువగా ఆలియా భట్ పై ఆమె కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తూ ఉంది.

తాజాగా మరోసారి కంగనా సోదరి రంగోలీ సోషల్ మీడియా ద్వారా ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లపై కామెంట్స్ చేసింది. వీరిద్దరిని పప్పూస్ అంటూ సంభోదించింది. ప్రస్తుతం ఆలియా.. రణబీర్ లు కలిసి నటిస్తున్న సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ఆ ఫొటోలను రంగోలీ ట్వీట్ చేసి వీరు ఒక్క రోజు గుర్రపు స్వారీ నేర్చుకుని అలసి పోయారు. ఈ పప్పూస్ తర్వాత రోజు గుర్రపు స్వారీని నేర్చుకునేందుకు రాలేదు. వీరు కంగనా మాదిరిగా కష్టపడగలరా అంటూ రంగోలీ ప్రశ్నించింది.

కంగనా గుర్రపు స్వారీని నేర్చుకునేందుకు సంవత్సరం కష్టపడింది. ఇండస్ట్రీ నుండి వచ్చిన వారు కాకుండా బయట వారు సినిమాల్లో నటించేందుకు చాలా కష్టపడతారు. కాని వారసులకు మాత్రం ఆ అవసరం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. బయట నుండి వచ్చిన వారంత కష్టపడటం ఈ పప్పూస్ కు సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను అన్నది అబద్దం అయితే వీరిద్దరు గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలు ఏమైనా మీరు నాకు పోస్ట్ చేయండి అంటూ నెటిజన్స్ ను కోరింది. మొత్తానికి సమయం చిక్కినప్పుడల్లా ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లను టార్గెట్ చేస్తూనే ఉంది.

× RELATED ఆర్జీవీ బయోపిక్ 'పప్పు వర్మ'