సాహో.. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడోచ్

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  జూన్ 13 న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.  ఈ టీజర్ విజువల్స్.. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు.. నేపథ్య సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  ఈ టీజర్ కు సంగీతం అందించింది జిబ్రాన్.   తాజా సమాచారం ప్రకారం జిబ్రాన్ నే 'సాహో' కు సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారట.

'సాహో' కు మొదట బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ల త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ను తీసుకున్నారు. కానీ ఒక నెల క్రితం వారు క్రియేటివ్ డిఫరెన్సుల  కారణంగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.  దీంతో అప్పటి నుంచి ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే చర్చ సాగుతోంది.  థమన్.. జిబ్రాన్ పేర్లు వినిపించినా..  టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు వచ్చిన స్పందన చూసి జిబ్రాన్ ను ఎంపిక చేశారు.  సాహో మేకింగ్ వీడియోస్ కు థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అయితే టీజర్ నేపథ్య సంగీతం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో జిబ్రాన్ కు అవకాశం దక్కిందని సమాచారం.

యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన 'రన్ రాజా రన్'.. 'జిల్' చిత్రాలకు జిబ్రాన్ సంగీతం అందించాడు.  అయితే 'సాహో' కు జిబ్రాన్ నేపథ్య సంగీతం మాత్రమే అందిస్తాడు.  'సాహో' పాటలకు ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లతో ట్యూన్స్ చేయించాలనే ఆలోచనలో ఫిలిం మేకర్స్ ఉన్నారట.    

    

× RELATED దర్శకుడి పుట్టిన రోజు సంగీత దర్శకుడి హడావుడి