పెద్ద టార్గెట్ వైపు నాని సిస్టర్

నిన్న ఫాదర్స్ డే సందర్భంగా నాని సోదరి దీప్తి గంట రూపొందించిన అనగనగా ఒక నాన్న షార్ట్ ఫిలిం తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ తెచ్చేసుకుంది. పదిహేను లోపే ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. న్యాచురల్ స్టార్ నాని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీని మేకింగ్ ని పర్యవేక్షించడంతో పాటు రిలీజ్ రోజున సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన తీరు బాగానే వర్క్ అవుట్ అయ్యింది.

యుఎస్ నుంచి చేస్తున్న జాబ్ వదిలేసి ఇక్కడే కుటుంబంతో ఉండాలని డిసైడ్ అయిన దీప్తి ఇకపై ఫుల్ లెన్త్ ఫిలిం మేకింగ్ మీద దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం. దానికి తగ్గట్టే షార్ట్ ఫిలిం లో నాని భార్య అంజనా దీప్తిల మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఒకవేళ సీరియస్ గా సినిమా తీయడం మీద దృష్టి పెడితే మంచిదే

గతంలో ఇలా హీరో సిస్టర్స్ ఫిలిం మేకింగ్ కు వచ్చిన వాళ్ళలో మహేష్ బాబు సోదరి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. నీలకంఠ షోతో మంచి బిగినింగ్ దక్కినా ఆ తర్వాత ఎందుకో అడపాదడపా ఎక్కువ కాలం సినిమాలు చేయలేకపోయారు. ఇందిరా బ్యానర్ పేరు మీద మహేష్ సినిమాల్లో ఇంతకు ముందు భాగస్వామ్యం వహించినప్పటికీ తర్వాత యాక్టివ్ గా ఉండటం మానేశారు. అయినా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు దీప్తి కూడా అదే తరహాలో ఇంకొంచెం బలంగా ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. అన్ని కుదిరితే ఇంట్లోనే న్యాచురల్ స్టార్ ఉన్నాడు.సరైన కథ చెప్పాలి కానీ సోదరి అడిగితే కాదంటాడా

    

× RELATED పక్షమైనా పూర్తవ్వకుండానే డిజిటల్ తెరపై