బిగ్ బాస్ 3: కమింగ్ సూన్..!

టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో మూడో సీజన్ ప్రారంభం కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.  మొదట్లో హోస్ట్ గా పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపించినా ఫైనల్ గా మాత్రం అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని అంటున్నారు. కంటెస్టంట్లు వీరే అంటూ ఇప్పటికే ఒక లిస్టు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ఇంత హంగామా జరుగుతూ ఉన్నప్పటికీ అటు స్టార్ మా ఛానెల్ వారి దగ్గర నుంచి కానీ ఇటు బిగ్ బాస్ తెలుగు ఆర్గనైజర్స్ నుండి కానీ ఎటువంటి సమాచారం లేదు. దీంతో ఇప్పట్లో మూడవ సీజన్ ప్రారంభమయ్యేలా లేదని కూడా కొన్ని గాసిప్స్ వినిపించాయి.  ఇలాంటి గాసిప్స్ కు తెరదించుతూ స్టార్ మా ఛానెల్ వారు బిగ్ బాస్ 3 ప్రోమో విడుదల చేశారు.

ఇందులో హోస్ట్ పేరు కానీ.. కంటెస్టెంట్ల వివరాలు కానీ వెల్లడించలేదు కానీ 'త్వరలోనే బిగ్ బాస్ 3' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం కూడా వెల్లడించలేదు. ఏదైతేనేం ఈ ప్రోమోతో బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సగం క్లారిటీ వచ్చింది. హోస్టు.. కంటెస్టెంట్ల వివరాలు కూడా వెల్లడైతే వారికి ఫుల్ క్లారిటీ వస్తుంది
× RELATED అసలు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ చేతికొచ్చింది ఎంత?