కారు ప్రమాదంలో వరుణ్ .. తాను క్షేమం

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కార్ ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో వ‌రుణ్ కి ఎలాంటి గాయాలు కాలేద‌ని తెలుస్తోంది. బుధ‌వారం సాయంత్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపెట్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి వరుణ్ సురక్షితంగా బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంద‌ని తెలుస్తోంది.

ప్రమాదం అనంత‌రం వ‌రుణ్ ట్విట్ట‌ర్ ద్వారా వివ‌రాలు అందించారు. కార్ లో ప్ర‌యాణిస్తున్న త‌మ‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని వ‌రుణ్ తేజ్ తెలిపారు. వాల్మీకి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింద‌ని.. కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు త‌మ కారుని ఢీకొట్టింద‌ని తెలిపారు. త‌మ‌ను ఢీకొట్టిన కార్ లోని యువకులు మద్యం మత్తులో ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని తెలిపారు.

కార్ లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవ‌డంతో ప్ర‌మాదం నుంచి వ‌రుణ్ బ‌య‌ట‌పడ్డార‌ని తెలుస్తోంది. యాక్సిడెంట్ అనంత‌రం అభిమానులు త‌న‌పై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ మేర‌కు ట్విట్ట‌ర్ లో వ‌రుణ్ వివ‌రాల్ని అందించారు. వాల్మీకి చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామ్ ఆచంట - గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

× RELATED వర్షాల్లో పుడితే 'వరుణ్' అని పెట్టేసారా?
×