కలెక్టరు గారి కూతురు... గవర్నమెంట్ విద్యార్థి

చదువుకున్న వాళ్లు - బోధన ఎలా చేయాలి అని ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్లు పాఠాలు చెప్పే స్కూళ్లు గవర్నమెంట్ స్కూల్స్. ఏ ఉద్యోగం రాక... టీచరుగా పనిచేసే వాళ్లతో (మొత్తం కాదు మెజారిటీ) నడిచే పాఠశాలలు ప్రైవేటువి. కానీ వాటిలో చేర్పించడానికే జనానికి మోజు. పిల్లలు ఎంత బాగా చదువుతారో చెప్పుకునే దశ నుంచి ఏ స్కూల్లో చదువుతారో చెప్పుకునే దశకు వచ్చాం మనం. అంటే పిల్లాడు ఎలా చదివినా పర్లేదు పేరున్న స్కూల్లో చదివితే అదే ఆనందం. ఈ సంకుచిత మనస్తత్వాన్ని పటాపంచలు చేస్తూ జనాన్ని పునరాలోచన చేసే ప్రవర్తించి ఓ జిల్లా కలెక్టరు. ఇది వేరే రాష్ట్రంలో కాదు. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే జరిగింది.

ఆర్డీవోగా పనిచేస్తున్నపుడు మంచిర్యాలలోని అంగన్ వాడీ స్కూలుకి పంపి సంచలనం అయిన ఆయేషా మస్రత్ ఖనమ్ ఇపుడు వికారాబాద్ జిల్లా కలెక్టర్. ఆమె గతంలో ఖమ్మం జాయింట్ కలెక్టరుగా పనిచేసింది. చాలా నిరాడంబరంగా బతికే క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఆవిడ. తాజా ఒక జిల్లాకు కలెక్టర్ అయినా... తన కూతురుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల స్కూల్లో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వాస్తవానికి ఎవరో మెచ్చుకోవాలని ఆమె ఈ పని చేయడం లేదు. తన పాప చిన్నప్పటి నుంచి ఆమె ప్రైవేటు  స్కూళ్ల వైపు చూడలేదు. డే కేర్ లో పెట్టలేదు.

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనుకుంటున్న ఆమె నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మైనార్టీ గురుకులాల (టీఎమ్ ఆర్ ఈఐఎస్)కార్యదర్శి షఫీయుల్లా ఆమెను ప్రశంసించారు. ఈ విషయమై తాజాగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇది పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. ఆయేషా కూతురు తాబిష్ రైనా టీఎంఆర్ వికారాబాద్ బాలికల పాఠశాల-1లో అడ్మిషన్ తీసుకోనున్నారు.
× RELATED రష్మికపై జగిత్యాల కలెక్టర్ కామెంట్..అసలు కథ ఇదీ
×