హాటీ సిస్ బరిలోకొస్తే బంతాటే!

హాటు గా ఉన్నా ఘాటుగా ఉన్నా నటనలో సత్తా చాటడం ముఖ్యం. కేవలం అందం ఉంటే సరిపోదు. నటనాభినయం.. వాచకంలోనూ సంథింగ్ ఏదైనా ఉండాలి. లేదంటే జనం నిర్ధయగా తిరస్కరిస్తున్నారు. అందుకే ఎంతో మంది కథానాయికలు గోడకు కొట్టిన బంతిలా వచ్చి వెళుతున్నారు. అయితే అందం కంటే హాట్ లుక్స్ తో చక్కని పెర్ఫామెన్స్ తో మైమరిపిస్తూ కెరీర్ బండిని అలా అలా నడిపించేస్తోంది కృతి సనోన్. ఈ అమ్మడు 1-నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయినప్పుడు మిశ్రమ స్పందనలే వచ్చాయి. ట్రైలర్ చూసి మహేష్ - సుకుమార్ కి టేస్ట్ లేదని విమర్శించిన వాళ్లే సినిమా చూశాక అభిప్రాయం మార్చుకున్నారు. అమ్మడిలో అందానికి మించి నటించే మ్యాటర్ ఉందని క్రిటిక్స్ ప్రత్యేకించి కితాబిచ్చారు. డెబ్యూ అయినా దులిపేసిందని పొగిడేశారు.

అందుకే ఆ తర్వాత కూడా సరైన హిట్టు ఒక్కటీ లేకపోయినా ఇప్పటికీ కెరీర్ పరంగా డోఖా లేకుండా నడిపించేస్తోంది. బాలీవుడ్ లోనూ కృతి కెరీర్ మరీ ఆశించిన రేంజులో ఏం లేదు. ఇటీవలే రిలీజైన రబ్తా.. లుక్కా చుప్పీ చిత్రాలు దారుణంగా ఫెయిలయ్యాయి. అయినా కృతి నటన.. హాట్ లుక్స్ గురించి అభిమానుల్లో చర్చ సాగింది. ముఖ్యంగా యూత్ లో కృతి ఫాలోయింగ్ తనకు పెద్ద ప్లస్. అయితే తన సంగతేమో కానీ..  తొందర్లోనే సిస్టర్ నూపూర్ ని బరిలో దింపే ప్రయత్నంలో ఉంది కృతి. గత కొంతకాలంగా ఎక్కే గడపా దిగే గడపా అన్నట్టుగా దర్శకనిర్మాతల్ని సంప్రదిస్తున్నారు కానీ ఛాన్స్ అయితే రాలేదు. అయితే ఆ లక్ చిక్కకపోతుందా అంటూ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు.

అయితే అక్కకు ఉన్న కాంటాక్ట్స్ ఎంట్రీకి ఉపయోగపడొచ్చు. అటుపై నూపుర్ నటన ద్వారానా బండి లాక్కెల్లాల్సి ఉంటుంది. అందుకు చాలానే శ్రమిస్తేనే పనవుతుంది. తాజాగా ప్రఖ్యాత ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ కవర్ పేజీపై  ఈ బ్యూటీ ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది. ఇందులో నూపూర్ చాలా హాట్ గా కనిపిస్తోంది. మ్యాగజైన్ కవర్ పై ఎంతో సెక్సీగా ఉందంటూ సిస్టర్ కి కృతి కితాబిచ్చేసింది. ఇక సినిమా పరంగానూ డెబ్యూ అంతే హాట్ గా ఉంటుందని భావించవచ్చు. కత్రిన.. దీపిక.. శ్రుతి హాసన్ అంతటి స్టార్ స్టడ్ బ్యాక్ డ్రాప్ ఉన్న బ్యూటీస్ కే ఆరబోసే డెబ్యూకి అంగీకరించక తప్పలేదు. కాబట్టి హాట్ సిస్ కి కూడా ఆ ఒక్కటే దారి అని భావించాలి!!


× RELATED 'పవర్ స్టార్' స్టిల్స్ పై పవన్ స్పందన ఇదేనట?
×