అటు ఇటూ కానీ ‘రాధా’ లోకం

మన గంటా శ్రీనివాసరావును రాజకీయ నేతలు చూసి నేర్చుకోవాలి.. ఆయన దగ్గర కోచింగ్ తీసుకుంటే ఇంకా మంచింది. ఎందుకంటే ప్రతీ సారి నియోజకవర్గాన్ని మారుస్తూ గెలుస్తుంటారు. ఇక గెలిచే పార్టీని ఎంచుకొని అందులో చేరి మంత్రి పదవులను అధిరోహిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఓడిపోయే పార్టీవైపు అడుగులు వేస్తూ తమ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటారు. అలాంటి వారిలో వంగవీటి రాధా ఒకరు..

వైసీపీలో జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చినా.. ఏదో ఒక సీటు ఇస్తానన్నా వినకుండా టీడీపీలో చేరి నిండా మునిగిపోయారు వంగవీటి రాధా. ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటే ఏం లాభం.. అంతా అయిపోయింది. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.

వంగవీటి రాధా రాజకీయ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టే కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ రాధా వేసిన తప్పటడుగు ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచే వైదొలిగేలా చేస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న రాధా పీఆర్పీలో చేరారు. అక్కడ నుంచి వైసీపీలోకి వచ్చారు. చివరగా వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక్కడే పెద్ద తప్పు చేశారు.

వంగవీటి రంగాను చంపించిన వారిలో టీడీపీకి చెందిన దేవినేని నెహ్రూదే కీలక పాత్ర అని ఆరోపణలున్నాయి. టీడీపీయే వంగవీటిని చంపించిందని చాలాసార్లు రాధా ఆరోపించారు. కానీ మొన్నటి ఎన్నికల వేళ ఇదే రాధా జగన్ విజయవాడ తూర్పు టికెట్ ఇవ్వనందుకు అలిగాడు. ఆ సీటు కాకుండా విజయవాడ పశ్చి మ సహా రెండు మూడు అసెంబ్లీ సీట్ల ఆప్షన్లను ఇచ్చినా వినకుండా రాధా తనకు బద్ధ శత్రువైన టీడీపీలో చేరాడు. తండ్రిని చంపిన టీడీపీలో చేరుతావా అని అందరూ తిట్టారు. కానీ జగన్   ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా రాధా మాత్రం వినియోగించుకోలేదు.  ఎక్కడ పోటీచేసినా రాధా వైసీపీ సునామీలో  గెలిచేవారు.

అయితే రాధా టీడీపీలో చేరిపెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు అటు వైసీపీలోకి వెళ్లకుండా ఉన్నాడు. టీడీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో మనుగడ సాగించలేని పరిస్థితి. దీంతో రాజకీయాలకే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట.. రాధా సన్నిహితుల నుంచి వస్తున్న వార్తల ప్రకారం బెంగళూరు వెళ్లి ఆయన తన వ్యాపారాలు చూసుకోవాలని డిసైడ్ అయినట్టు సమచారం. ఇలా ఎంతో రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా రాధా రాజకీయంగా వేసిన తప్పటడుగులు ఆయన ను రాజకీయా జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టాయని అంటున్నారు.


    
    
    

× RELATED 83 వరల్డ్ కప్ విజేత కపిల్ దేవ్ వైఫ్ ఈవిడే
×