నో రెస్ట్ అంటున్న సాహో టీం

టాలీవుడ్ మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ మూవీ సాహో టీజర్ కోసం ఎదురు చూపులు రోజుల నుంచి గంటల్లోకి వచ్చేశాయి. కేవలం నిమిషం లేదా ఇంకో పాతిక సెకండ్లు ఎక్కువ ఉండే వీడియో కోసం ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూడటం బాహుబలి తర్వాత ఇదేనేమో అనే స్థాయిలో దీని మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రమోషన్ విషయంలో సాహో కొంత స్లోగా ఉందన్న కామెంట్స్ కు చెక్ పడేలా టీజర్ ని ఓ రేంజ్ లో కట్ చేసినట్టు ఇప్పటికే రిపోర్ట్స్ అందుతున్నాయి.

దీని గురించి టీం ఎలాంటి టెన్షన్ పడటం లేదు. తన టార్గెట్ అంతా సాహో బాలన్స్ వర్క్ పూర్తి చేయడం మీదే ఉంది. ఇంకా ఓ పాట పెండింగ్ ఉండటంతో లీడ్ పెయిర్ ప్రభాస్ శ్రద్ధ దాస్ లతో ఆస్ట్రియలో ఓ దాన్ని షూట్ చేయబోతున్నారు.  ఇండియాలోనే చిత్రీకరణ చేసి పూర్తి చేసే అవకాశాలు ఉన్నా కథ నేపధ్యం ప్రకారం సహజత్వం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండకూడదు అంటే అక్కడే తీయాలని నిర్ణయించుకోవడంతో మరికొద్ది రోజుల్లో దాన్ని ఫినిష్ చేసుకుని వచ్చేస్తారు.

మరో వైపు రెండో యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. విడుదలకు ఇంకో రెండు నెలలు మాత్రమే టైం ఉండటంతో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు రీ రికార్డింగ్ చాలా పెద్ద తతంగం కాబట్టి ఎక్కడా గ్యాప్ రాకుండా రాత్రింబవళ్ళు దాని మీదే వర్క్ చేస్తున్నాయట. ఇప్పుడు డేట్ తప్పడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 విడుదల రావాల్సిందే. సో రెస్ట్ అనే పదాన్ని ఇంకో మూడు నెలల దాకా సాహో టీం మర్చిపోక తప్పదు. ఎందుకంటే రిలీజయ్యాక కూడా వేరే వ్యవహారాలు చాలా ఉంటాయి కాబట్టి

    

× RELATED టాప్ స్టోరి: ఐడియల్ అత్తా కోడళ్లు
×